Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ పై ఫ్యాన్స్ అభిమానం ఇంతేనా..!
By: Tupaki Desk | 21 March 2020 12:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సౌత్ ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాములుగా ఆయన సినిమా షూటింగ్ జరుగుతుంది అంటేనే సందడి చేసే అభిమానులు. ఇక సినిమా విడుదల అవుతుందంటే మాత్రం పండగ చేసేస్తారు. అలాంటి కోట్ల అభిమానుల సంఖ్యను కలిగిన పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాల నుండి బయటికి పూర్తిగా సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్నాడట. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'వకీల్ సాబ్' కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. కానీ రాజకీయం పరంగా జనానికి దగ్గరయ్యాడు.
అయితే తాజాగా వకీల్ సాబ్ సినిమాకోసం థమన్ స్వరపరిచిన 'మగువా..మగువా' సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, యువసంచలనం సిద్ శ్రీరామ్ గీతాలాపన చేసాడు. అభిమానులకు పవన్ కళ్యాణ్ సినిమా నుండి ఏ ఒక్క వార్త వినిపించినా వైరల్ అవుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన వకీల్ సాబ్ పోస్టర్, పాటే దానికి ఉదాహరణ. ఇదిలా ఉండగా 'మన నుడి మన నది' పేరుతో గత వారంరోజులుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జనసేన పార్టీకోసం సంగీత దర్శకుడు థమన్, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రిలు చేయికలిపారట.
అయితే జనసేన నిర్వహిస్తున్న 'మన నుడి..మన నది' కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి ఒక ప్రచార గీతాన్ని రూపొందించారు. మన విలువలను, మన నదుల గురించి వివరించే ఈ పాటను కొన్ని గంటల క్రితం యూట్యూబ్ లో విడుదల చేసారు. సామాన్యంగా పవన్ కళ్యాణ్ నుండి పోస్టర్ వస్తేనే లక్షల లైకులు, షేర్స్ చేసే అభిమానులు 'మన నుడి..మన నది' పాటను చూడకపోవడం ఆశ్చర్యకరం. మరో విషయం ఏంటంటే సాంగ్ విడుదల చేసి గంటలు గడుస్తున్నా వ్యూస్ మాత్రం వేలల్లోనే ఉండటం. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు కేవలం సినిమాల పరంగానే ఆరాధిస్తున్నారని సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానుల స్పందన ఎలా ఉండబోతుందో..