Begin typing your search above and press return to search.
వైష్ణవ్ ఫస్ట్ స్పీచ్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
By: Tupaki Desk | 7 Feb 2021 5:45 AM GMTమెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ పరిచయం కాబోతున్నాడు. మెగాస్టార్ కు ముద్దుల మేనల్లుడిగా పేరున్న వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఈ వారంలో విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మరియు చిత్ర యూనిట్ సభ్యులు హాజరు అయ్యారు. సహజంగా మొదటి సినిమా ఈవెంట్ అంటే హీరోల్లో కాస్త తడబాటు ఉంటుంది. హీరో వైష్ణవ్ తేజ్ మాటల సమయంలో కూడా కాస్త తడబాటు కనిపించినా కూడా తాను మాట్లాడాలనుకున్నది స్పష్టంగా మాట్లాడేసి చెప్పాలనుకున్నది అందరికి చెప్పేసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేశాడు.
ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో ఒకరు అన్నట్లుగా వైష్ణవ్ తేజ్ వాయిస్ చాలా బాగుంది. ఆయన మాట్లాడుతూ.. ముందుగా మా అమ్మ గురించి మాట్లాడాలి. నువ్వు లేకపోతే నేను అన్నయ్య లేము. చాలా త్యాగాలు మా కోసం చేశావు థ్యాంక్యూ అమ్మ. మా ముగ్గురు మామయ్యల గురించి మాట్లాడాలి. వీరు ముగ్గురు లేకుంటే నేను అన్నయ్య ఉండం. మాకు ఏం కావాలన్నా కూడా చిన్నప్పటి నుండి కూడా చేసి పెడుతూ ఉండేవారు. ముగ్గురు మామయ్యలకు కూడా జీవితాంతం రుణ పడి ఉంటాను. మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా మాకు సపోర్ట్ గా నిలిచారు. ఒక తమ్ముడిగా కొడుకుగా నన్ను ప్రతి ఒక్కరు చూసుకున్నారు.
ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే మొదట సుకుమార్ గారిని కలిసిన సమయంలో చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను. నటన డాన్స్ ఏమీ నాకు రావండి అన్నాను. ఆ సమయంలో అన్ని నేను చూసుకుంటాను అంటూ సుకుమార్ గారు చాలా ధైర్యం చెప్పారు. దర్శకుడు బుచ్చి గారికి థ్యాంక్యూ. సినిమాలో కథ హీరో.. నేను ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తాను. నాకు ఇంత పెద్ద లాంచింగ్ ఇచ్చినందుకు మైత్రి వారికి కృతజ్ఞతలు. హీరోయిన్ కృతి వారం రోజుల్లోనే తెలుగు నేర్చుకుంది. ఆమె నుండి నేను ఎంతో నేర్చుకున్నాను అంటూ ప్రతి ఒక్కరి గురించి చాలా స్పష్టంగా సింపుల్ గా తన భావాలను వ్యక్తం చేయడంలో వైష్ణవ్ సక్సెస్ అయ్యాడు. మొత్తానికి మొదటి స్పీచ్ తోనే వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యాన్స్ మెప్పు పొందాడు.