Begin typing your search above and press return to search.
మొగల్తూరు పిల్లనే డార్లింగ్ మనువాడుతున్నాడా?
By: Tupaki Desk | 11 Jun 2022 2:30 AM GMTబాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెళ్లి..టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి మిస్టరీ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ఎప్పటికప్పుడు మీడియాలో ఆసక్తికర కథనాలు వైరల్ అవుతూనే ఉంటాయి. కొంత కాలంగా చదివి విని వదిలేయడం అంతే కామన్ గా మారిపోయింది.
చివరికి ప్రభాస్ పెళ్లి విషయంలో పెదనాన్న కృష్ణంరాజు సైతం ఒకానొక సందర్భంలో విసుగెత్తిన వైఖరిని సైతం వెల్లడించారు. చేసుకోమాన్నా..చేసుకోవడంలేదు. ఆ సంగతేంటో తననే అడగండి! అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక మీడియాలో కొన్ని సందర్భాల్లో వధువు అలా ఉంటుందిట. మొగల్తూరు మహారాణి అంట ఇలా కొన్ని కథనాలు వెడెక్కించాయి.
కానీ అవన్ని గాలి వార్తలని తేలిపోయింది. 40 దాటిన హీరోకి ఇంకేం పెళ్లి? అన్న వ్యతిరేక పవనాలు సైతం వీచాయి. అయితే ఇప్పుడా నెగిటివిటీ అంతా పాజిటివ్ గా మారుతుందా? డార్లింగ్ పెళ్లి ప్రయత్నాలు సీరియస్ గా సాగుతున్నాయా? అంటే అవుననే సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. డార్లింగ్ పెళ్లిపై కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం నెట్టింట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఓ యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ సంవత్సరం కచ్చితంగా పెళ్లి చే సుకుంటాడని ఎంతో కాన్పిడెంట్ గా చె ప్పారు. ఇదే మాటని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సైతం బల్ల గుద్ది మరీ చెప్పాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్లూరు గ్రామానికి చెందిన అభిమానం సంఘం అధ్యక్షుడు ఈ విషయాన్ని రివీల్ చేయడంతో మరింత ఆసక్తి సంతరించుకుంది.
ఈ పెళ్లి గురించి కృష్ణం రాజు స్పందించిన తర్వాత ప్యాన్స్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించడంతో డార్లింగ్ పెళ్లి నిజమేనన్న బలమైన సంకేతాలు అందుతున్నాయి. ఇదే నిజమైతే అభిమానులకు పండగే. ఎంతో కాలంగా డార్లింగ్ పెళ్లి ప్రయత్నాలు జరుగుతుండగా ఇప్పటికీ ఫలం దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ తో 'సలార్' సినిమా చేస్తున్నాడు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. 'కేజీఎఫ్' ప్రాంచైజీని మించి ఉంటుందని అంచనాలున్నాయి. అలాగే బాలీవుడ్ లో 'ఆదిపురుష్' సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచారం చిత్రాలు అంతకంతకు ఫ్యాన్స్ లో ఎగ్టైట్ మెంట్ ని తీసుకొచ్చాయి.