Begin typing your search above and press return to search.

#ChaiSam : రియల్‌ గా విడిపోయినా రీల్ లో కలవాలని ఫ్యాన్స్ కోరిక

By:  Tupaki Desk   |   4 Oct 2021 7:32 AM GMT
#ChaiSam : రియల్‌ గా విడిపోయినా రీల్ లో కలవాలని ఫ్యాన్స్ కోరిక
X
క్యూట్‌ అండ్ బ్యూటీఫుల్‌ కపుల్‌ నాగ చైతన్య సమంత విడిపోయిన విషయం అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. సుదీర్ఘంగా ఆలోచించి ఎవరి దారిలో వాళ్లం నడవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఇద్దరు ఒకే సారి ప్రకటించారు. ఇద్దరి మద్య విభేదాలు పెద్దగా లేవని.. కాని ఇద్దరి అభిప్రాయాల విషయంలో చిన్న చిన్న తేడాలు రావడం వల్ల విడిపోయారు అనే టాక్‌ వస్తుంది. వారు కూడా ఇద్దరం స్నేహితులుగా ముందు ముందు ఉంటాం అన్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇద్దరు ఒకే సారి ఒకే నోట్ ను షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇద్దరు స్నేహ పూర్వక వాతావరణంలోనే విడిపోయారు అని తేలిపోయింది. ఇద్దరి విషయంలో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. తమ ఇంట్లో జంట విడిపోయారు అన్నంతగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయంను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని ఆశిస్తున్నాం అంటూ సమంత చైతూలు విజ్ఞప్తి చేశారు. దాంతో వారు చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు కనుక ఇంకా ఎక్కువగా ఈ విషయాన్ని చర్చించడం వద్దని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాగ చైతన్య సమంత లు కలిసి ఏమాయ చేశావే సినిమాలో మొదటి సారి నటించారు. ఆ సినిమాలో సమంత చైతూ కంటే ఎక్కువ వయసు అమ్మాయిగా కనిపించింది. ఆ సినిమా లవ్‌ స్టోరీకి సరికొత్త అర్థంను ఇచ్చింది. వీరిద్దరు నటించిన నాలుగు సినిమాలు కూడా మంచి టాక్ ను దక్కించుకున్నాయి. ఆటో నగర్‌ సూర్య సినిమా వీరికి కమర్షియల్‌ సక్సెస్ ను అందించకున్నా కూడా ఇద్దరి జోడీ బాగుంది అనేలా అంతా కూడా చర్చించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మనం మరియు మజిలీ సినిమాల్లో వీరిద్దరి నటన మరియు అన్యోన్యత అందరిని ఆకట్టుకున్నాయి. వావ్ అనిపించేంతగా ఆకట్టుకున్నారు. మళ్లీ వీరిద్దరిని ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తాం.. వీరి కాంబోలో అయిదవ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో విడాకుల ప్రకటన వచ్చింది.

నాలుగు సినిమాలు ఎన్నో కమర్షియల్స్ లో నటించిన ఈ మాజీ జంట ముందు ముందు మళ్లీ కలిసి నటిస్తారా అంటే డౌటే అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. సమంత నటించేందుకు సిద్దంగా ఉన్నా చైతూ మొహమాటం మరియు ఇతర కారణాల వల్ల నటించక పోవచ్చు అంటున్నారు. కాని ఎక్కువ శాతం అభిమానులు వారి అభిప్రాయం ప్రకారం ఎవరికి వారు విడిపోయినా ఖచ్చితంగా ఇద్దరు కూడా మళ్లీ నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానులు మరియు శ్రేయోభిలాషులు కూడా వీరి కాంబో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. విడిపోయినా కూడా మళ్లీ నటించిన వారు.. కలిసిన వారు చాలా మంది ఉన్నారు. కనుక ఖచ్చితంగా వీరిద్దరు కలిసి నటించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి వారి కోరిక తీరేనా అనేది చూడాలి.