Begin typing your search above and press return to search.
థియేటర్ లో పవనిజం..PSPK అక్షరాలతో రక్త తిలకం దిద్దిన వీరాభిమాని!
By: Tupaki Desk | 10 April 2021 4:30 AM GMTదాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ గా తిరిగి అభిమానుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లు దద్దరిల్లేలా పవన్ అభిమానులు చేస్తున్న హంగామాపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. ఇప్పటికే వకీల్ సాబ్ మానియాపై తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ కథనాలు వైరల్ అవుతున్నాయి. గ్యాప్ వచ్చినా పవన్ వస్తే చాలు అభిమానుల్లో పూనకాలు ఎలా ఉంటాయో కథలు కథలుగా ప్రచారమవుతున్నాయి.
వకీల్ సాబ్ పై అధికారుల ప్రభుత్వాల ప్రతికూల చర్యలపైనా ప్రస్తుతం సోషల్ మీడియాల్లో డిబేట్ నడుస్తోంది. దీంతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు ఎంత ఎమోషనల్ గా ఉంటారో తెలియజేసే పలు ఘటనలపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. వకీల్ సాబ్ రిలీజ్ ముందు నుంచి థియేటర్ల ముందు హంగామా చూస్తున్నదే. సోషల్ మీడియాల్లో ఇప్పటికే పవనిజానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ రిలీజ్ సెలబ్రేషన్స్ ని ప్రత్యేకమైన మార్గాల్లో జరుపుకున్నారు. కొన్నిచోట్ల వంద అడుగుల పవన్ కటౌట్లను నిర్మించి ప్రచారం చేయగా.. కొందరు అభిమానులు తమ చేతుల్ని కత్తులతో కోసుకుని పవన్ కటౌట్లు ఫ్లెక్సీలకు రక్తతిలకం దిద్దారు. ఒక అభిమాని అయితే ఏకంగా థియేటర్ లోనే తన చేతిని కోసుకుని బొమ్మ ఆడుతుండగానే పీఎస్ పీకే అంటూ స్క్రీన్ పై రాశాడు. దానికోసం అతడు తన రక్తాన్ని ఉపయోగించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. తెరముందు నిలబడి అతడు అలా చేయడాన్ని చూస్తూ విస్తుపోవడం జనం వంతయ్యింది. అయితే అది ఏ థియేటర్ లో.. ఆ అభిమాని ఎవరు అన్నదానికి వివరాలు లేవ్. ప్రస్తుతానికి వీడియో మాత్రం వైరల్ అయిపోతోంది.
ఇక చాలా చోట్ల థియేటర్లలో పవన్ అభిమానులు మేకల్ని బలి ఇవ్వడం కోళ్లను కోసుకు తినడం వంటి పండగ వాతావరణం చూసేదే. ఈసారి కూడా ఆ తరహా ఉత్సాహం చాలాచోట్ల కనిపించిందని జనసైనికుల్లో ముచ్చట సాగుతోంది.
అయితే ఇలాంటి చర్యల్ని పవన్ అనుమతిస్తారా? అంటే ససేమిరా అనేస్తారు. తన కోసం చేతులు కోసుకునే లేదా కాల్చుకునే అభిమానాన్ని పవన్ హర్షించరు. అలాగే జంతుబలుల్ని మూగ ప్రాణుల హననాన్ని అస్సలు ఆకాంక్షించరు. కానీ పవన్ అభిమానులు అలా చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పవన్ ఎంతో శాంతి కాముకుడిగా శత్రువుని కూడా గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు. జనసేనాని గా ఆయన ఇమేజ్ ని పెంచుకుంటున్నారు. కానీ అభిమానుల ఈ ప్రతికూల చర్యలపై ప్రజలు ఎలా స్పందిస్తారు? అన్నది ఆసక్తిగా మారింది. ఈ సంఘటనలపై పవన్ కానీ చిత్రబృందం కానీ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి.