Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ ట్విట్టర్ వార్.. ఏజెన్సీలకు బిగ్ డిమాండ్!
By: Tupaki Desk | 23 Aug 2022 5:30 PM GMTసోషల్ మీడియా ఇప్పుడు పాజిటివిటీ కంటె నెగెటివిటీకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. పొలిటికల్ లీడర్ల నుంచి సినీ స్టార్ల వరకు ఈ మాధ్యమంలో యాక్టీవ్ గా వుంటూ తమ అభిమానులతో నిత్యం టచ్ లో వుంటున్నారు. దీంతో అభిమానులకు, స్టార్స్ కి మధ్య దూరం తగ్గిపోయి మంచి అనుబంధం ఏర్పడుతోంది. తమ సినిమాల అప్ డేట్ లని ఫ్యాన్స్ నేరుగా సదరు డైరెక్టర్, ప్రొడ్యూసర్ లేదా హీరోనే నేరుగా అడిగేయడం.. వెంటనే వారి నుంచి సమాధానాలు వస్తుండటంతో సోషల్ మీడియా ఫ్యాన్స్ కి స్టార్స్ కి ప్రధాన వారధిగా మారింది.
అయితే ఇప్పుడు దీని లక్ష్యం మారి విద్వేషాన్ని రగిలించే సాధనంగా మారుతోంది. కొంత మంది పని గట్టుకుని సోషల్ మీడియాను నెగెటివ్ ప్రచారం కోసం ఉపయోగిస్తూ స్టార్స్ కి తలనొప్పిగా మారుతున్నారు. కొంత మంది మరీ హద్దులు దాటేసి స్టార్స్ ని నెట్టింట నిలదీయడం, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో కామెంట్ లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇదిలా వుంటే తాజాగా బాలీవుడ్ లో మొదలైన 'బాయ్ కాట్ ' ట్రెండ్ కూడా విమర్శలకు తావిస్తోంది.
నచ్చని హీరో సినిమా వస్తోందంటూ చాలు బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. లెక్కకు మించిన జనాలు నెగెటివిటీని ప్రచారం చేస్తూ నెట్టింట బాయ్ కాట్ నినాదంతో రెచ్చిపోతున్నారు. సదరు స్టార్స్ పై విచక్షణా రహితంగా కామెంట్ లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. దీంతో సదరు స్టార్ కి సంబంధించిన పీఆర్ టీమ్ ప్రతిప్పందిస్తూ ప్రత్యేకంగా ఓ టీమ్ ని ఇందుకు సిద్ధం చేసుకుంటూ పాజిటివిటీని క్రియేట్ చేస్తూ నెట్టింట ట్రెండ్ చేస్తోంది.
ఇప్పడు ఈ ట్రెండ్ 'లైగర్'తో టాలీవుడ్ ని కూడా తాకిన విషయం తెలిసిందే. ఈ మూవీపై ప్రస్తుతం బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. దీన్ని ప్రతిఘటించడం కోసం చిత్ర బృందం, హీరోకు సంబంధించిన పీఆర్ టీమ్ ప్రత్యేకంగా ఓ టీమ్ ని ఏర్పాటు చేసుకుని పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ట్వీట్ లు చేయిస్తోంది. కొంత మంది యాంటీ ఫ్యాన్స్ ద్వారా నెగెటివిటీ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో సదరు హీరోల పీఆర్ టీమ్ దాన్ని పోగొట్టడానికి కఠోరంగా శ్రమించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
బాలీవుడ్ లో అయితే ట్విట్టర్ వార్ మరీ దారుణంగా తయారైంది. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలపై ఓ వర్గం నెగిటివిటీని ప్రచారం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీన్ని తట్టుకుని నిలబడటం కోసం సదరు స్టార్ హీరోలు పీఆర్ టీమ్ పై ఆధారపడుతున్నారు. దీంతో వారి చాలా ప్రతికూలతల మధ్య పని చేయాల్సి వస్తోంది. తెలుగులో 'RRR' రిలీజ్ కి ముందు.. రిలీజ్ తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య భారీ స్థాయిలో ట్విట్టర్ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య కూడా ఇదే తరహా అగ్లీ ఫైట్ జరిగి నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి విపరీత పోకడల నుంచి తమని తాము రక్షించుకోవడం కోసం స్టార్స్ ఏజెన్సీలని ఆశ్రయిస్తూ ఓ టీమ్ ని ఫామ్ చేయించి తమపై వైరల్ అవుతున్న నెగెటివిటీకి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడిది ట్రెండ్ గా కూడా మారడంతో చాలా వరకు ఏజెన్సీలకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది.