Begin typing your search above and press return to search.

ఫోటో షేర్ చేసి తిట్లు తిన్న ప్రియాంక మొగుడు!

By:  Tupaki Desk   |   12 Sep 2019 7:43 AM GMT
ఫోటో షేర్ చేసి తిట్లు తిన్న ప్రియాంక మొగుడు!
X
సోషల్ మీడియాకు ఆదరణ పెరిగిన వేళ.. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకూ తమ వ్యక్తిగత అంశాలతో పాటు.. ఫోటోల్ని షేర్ చేయటం ఎక్కువైంది. తమను అభిమానించే వారికి తమకు సంబంధించిన వివరాలు పంచుకోవాలన్న తాపత్రయం వారు పెట్టే పోస్టులతో ఇట్టే తెలిసేలా చేస్తుందని చెప్పాలి. దీంతో.. తమ రోజువారీ ఫోటోలతో పాటు.. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేయటం ఎక్కువైంది.

తాజాగా అలాంటి పనే చేసి అడ్డంగా బుక్ అయ్యారు బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా భర్త నిక్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమకు సంబంధించిన ఫోటోల్ని తరచూ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఫోటో షూట్ చేసిన నిక్.. సిగిరెట్ కాలుస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చేవారు.

పొగతాగటం ఆరోగ్యానికి హానికరమని.. ఆ విషయం తెలీదా? అని కొందరు ప్రశ్నిస్తే.. నిక్ మీరంటే ఇష్టమే.. కానీ ధూమపానం మంచిది కాదన్న సలహాను చెబుతున్నారు. మీ సతీమణి ప్రియాంకకు అస్తామా ఉంది.. మీరు ఇలా సిగిరెట్లు తాగితే ఆమెకు ప్రమాదమంటూ హెచ్చరించారు. అభిమానుల నుంచి ఈ తరహాలో రియాక్షన్స్ వస్తుంటే.. ప్రియాంక మాత్రం నిక్ ఫోటోకు యమ్మీ అంటూ కామెంట్ చేయటం గమనార్హం. చూస్తుంటే.. తాము అభిమానించే ప్రియాంక ఆరోగ్యం గురించి నిక్ కంటే.. అభిమానులే ఎక్కువ అలెర్ట్ గా ఉన్నారని చెప్పక తప్పదు.