Begin typing your search above and press return to search.
మే 20న 'రామరాజు ఫర్ భీమ్'...?
By: Tupaki Desk | 28 March 2020 9:30 AM GMTరామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఎంతో కాలంగా 'సీతారామరాజు' అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ అభిమానులకు ఈ వీడియో ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది. ఈ వీడియోలో రామ్ చరణ్ ని చూసిన చెర్రీ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని కూడా ఔరా అనక మానడు. ఈ వీడియో అవుట్ ఫుట్ తో రామ్ చరణ్ కూడా మంచి హ్యాపీగా ఉన్నాడంట. ఇంక ఫ్యాన్స్ విషయానికొస్తే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు అనే చెప్పవచ్చు.
అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు సరే, మరి ఎన్టీఆర్ అభిమానుల సంగతి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే చర్చ జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ వీడియోకి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే వచ్చే నెల అనగా మే 20వ తేదీన ఎన్టీఆర్ వీడియో రానున్నదని సమాచారం. ఆ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా ఒక స్పెషల్ వీడియో రెడీ చేపిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'రామ్ ఫర్ భీమ్' అన్నమాట. ఇప్పటికే విడుదలైన వీడియో లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ గురించి అన్ని ఇండస్ట్రీలలో మాట్లాడుకుంటున్నారు. మరి రాబోయే 'కొమరం భీమ్' వీడియోలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో అంటూ అభిమానులు ఇప్పటి నుండే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఏదేమైనా ఆ స్పెషల్ వీడియో కోసం మే 20 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉండగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రౌద్రం రణం రుధిరం' టైటిల్ ఫైనలైజ్ చేసిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్ మంచి ఆదరణ పొందింది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, అందులోనూ టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 'రౌద్రం రణం రుధిరం' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.