Begin typing your search above and press return to search.
సమ్మర్ వరకు ఆగాల్సిందేనా పవనాయక?
By: Tupaki Desk | 13 Nov 2021 12:30 PM GMTపవన్ కళ్యాణ్ కరోనా సెకండ్ వేవ్ కు ముందు వకీల్ సాబ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలై ఫలితంను మార్చేసింది. ఆ సినిమా తర్వాత పవన్ నుండి భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయ్యింది.
వకీల్ సాబ్ తరహాలో కాకుండా మంచి విడుదల తేదీని ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అంటూ వచ్చే సంక్రాంతికి తేదీని ఖరారు చేయడం జరిగింది. సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యి హడావుడి కూడా మొదలు అయిన సమయంలో అనూహ్యంగా ఆర్ ఆర్ ఆర్ ను రంగంలోకి దించడం వల్ల భీమ్లా నాయక్ తో పాటు ఇతర సినిమాల విడుదల తేదీలపై ఎఫెక్ట్ పడింది.
సంక్రాంతికి వారం ముందు వస్తున్నా కూడా ఆర్ ఆర్ ఆర్ వచ్చిన రెండు మూడు వారాల వరకు వేరే సినిమా లను జనాలు చూస్తారో చూడరో అనే భయంతో పాటు ఆ సినిమాకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో భీమ్లా నాయక్ ను తప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల విడుదల అయిన పోస్టర్ లో సినిమా విడుదల తేదీని తొలగించారు. దాంతో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి లేదు అని తేలిపోయింది. భీమ్లా నాయక్ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయకున్నా కూడా వెంటనే రిపబ్లిక్ డే కు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉండటం వల్ల రిపబ్లిక్ డే కు విడుదల చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో మేకర్స్ జనవరి మొత్తంను స్కిప్ చేస్తున్నారు. సరే ఫిబ్రవరిలో అయినా ఆచార్య తర్వాత రెండు వారాల తర్వాత వద్దామనుకున్న మేకర్స్ కు షాక్ ఇస్తూ ఖిలాడీ సినిమా రాబోతుంది. అంతే కాకుండా ఎఫ్ 3 కూడా విడుదలకు సిద్దంగా ఉంది. దాంతో ఫిబ్రవరి లో ఈ సినిమా సాధ్యం కాదు అని తేలిపోయింది.
ఇక మార్చి పరీక్షల సమయం కనుక ఖచ్చితంగా ఆ సమయంలో విడుదల కరెక్ట్ కాదు. అందుకే ఏప్రిల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏప్రిల్ 1 వ తారీకున సర్కారు వారి పాట సినిమా ఉండటంతో పాటు కేజీఎఫ్ సినిమా కూడా ఉంది. అందుకే ఏప్రిల్ మంచి సమయం కోసం భీమ్లానాయక్ ప్లాన్ చేసే అవకాశం ఉంది.
అది కూడా కుదరకుంటే మే నెల వరకు భీమ్లా నాయక్ సినిమా విడుదల కోసం వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేసే విషయంలో మేకర్స్ చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎప్పటికి సినిమా వస్తుందో క్లారిటీ లేకుండా ఉంది.