Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ మూవీ వచ్చినా ఆ సినిమా కోసమే అంతా వెయిటింగ్
By: Tupaki Desk | 11 May 2022 1:30 PM GMTఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు మస్త్ వినోదాన్ని పంచేందుకు కొత్త సినిమాలు రెడీగా ఉన్నాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో సూపర్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేసిన బీస్ట్ సినిమాకు మంచి స్పందనే దక్కుతోంది. కాని బీస్ట్ సినిమా కంటే ఎక్కువగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం ఇండియన్ సినీ ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
ఒక చిన్న సినిమా గా విడుదల అయిన ది కశ్మీర్ ఫైల్స్ అనే హిందీ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వందల కోట్ల వసూళ్లను నమోదు చేసిన ఆ సినిమాను ప్రాంతీయ భాషల్లో ప్రేక్షకులు థియేటర్లలో చూడలేక పోయారు. కొన్ని చోట్ల విడుదల అయినా కూడా ఎక్కువ శాతం మంది.. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అంతా కూడా తమతమ భాషల్లో ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయడం కోసం వెయిటింగ్ లో ఉన్నారు.
సోషల్ మీడియాలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ మరియు ప్రమోషన్ భారీగా జరిగింది. మౌత్ టాక్ తో సినిమా కు విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. కనుక థియేటర్ స్క్రీనింగ్ మిస్ అయిన వారు ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నారు. 1990 లో కశ్మీరీ పండిట్స్ ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి సినిమాలో చూపించడం జరిగింది.
ఇండియా మరియు పాకిస్తాన్ లో కశ్మీరీ పండిట్లకు ఎదురైన అనుభవాలు మరియు ప్రభుత్వం వారి పట్ల వ్యవహరించిన తీరు గురించి సినిమా లో చూపించడం జరిగింది. ప్రతి ఒక్క దేశ భక్తుడు సినిమా చూడాలంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమాను బహిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న సినిమా ఇది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని ఎంతో మంది ది కశ్మీర్ ఫైల్స్ కు కితాబిచ్చారు. కొందరు ప్రముఖులు వ్యతిరేకించడం వల్ల కూడా మంచి పబ్లిసిటీ దక్కింది. జనాలు ఇంతగా కశ్మీర్ ఫైల్స్ ను అభిమానించడానికి.. అంతగా వ్యతిరేకించడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ ఓటీటీ లో సినిమాను చూడాలని కోరుకుంటున్నారు.