Begin typing your search above and press return to search.

అభిమానులు మళ్ళి ఆడుగుతున్నారట!

By:  Tupaki Desk   |   12 April 2019 5:34 AM GMT
అభిమానులు మళ్ళి ఆడుగుతున్నారట!
X
గత రెండు నెలలుగా ఎడారిలా మారిన బాక్స్ ఆఫీస్ ని ఒయాసిస్సులా ముంచెత్తింది మజిలీ. నాగ చైతన్యకు సరైన టైంలో బ్రేక్ ఇవ్వడమే కాక సమంతకు సైతం పెర్ఫార్మన్స్ పరంగా వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటిదాకా ఈ కాంబోలో వచ్చిన నాలుగు సినిమాల్లో ఒక్క ఆటోనగర్ సూర్య మాత్రమే మిస్ ఫైర్ అయ్యింది. అఫ్ కోర్స్ దాన్ని ఇప్పుడు చూసిన వాళ్ళలో కొందరు క్లాసిక్ అనేవాళ్ళు లేకపోలేదు. ఈ లెక్కన చై సామ్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.

ఇప్పుడు పెళ్లయ్యాక కూడా మజిలీతో మరోసారి అది గట్టిగా ప్రూవ్ కావడంతో మళ్ళి రిపీట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో అక్కినేని జంట ఉన్నట్టు సమాచారం. ఆ మేరకు ఓ ఇద్దరు యూత్ డైరెక్టర్స్ తో అలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే చెప్పమని అడిగారట

ఇక్కడో విషయం గమనించాలి. మజిలీలో ఇద్దరి కెమిస్ట్రీ అంత అద్భుతంగా పండడానికి కారణం నిజ జీవితంలోనూ వాళ్లిద్దరూ భార్యాభర్తలు కావడం సినిమాలోనూ అవే పాత్రలు పోషించడం. టాలీవుడ్ లోనే మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరున్న చైతు సామ్ లు తెరమీద అలా కనిపించే సరికి జనం బాగా కనెక్ట్ అయిపోయారు.

ఒకవేళ ఎదైనా డిఫరెంట్ గా ట్రై చేసి లవర్స్ గానో లేక ఇంకేదైనా కొత్త తరహా పాత్రల్లోనో చూపిస్తే ఎంత వరకు కనెక్ట్ అవుతారు అనేది సదరు దర్శకుడి ప్రెజెంటేషన్ ను బట్టి ఉంటుంది. అభిమానులకైతే ఈ కాంబోని మళ్ళి మళ్ళి చూడాలని ఉంటుంది కానీ దానికి తగ్గ కథలను సెట్ చేయడం అంతే ఈజీ కాదుగా