Begin typing your search above and press return to search.

మహేష్‌ కు మరో ఆల్ ఇండియా రికార్డును పట్టిన ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   2 Jan 2022 6:03 AM GMT
మహేష్‌ కు మరో ఆల్ ఇండియా రికార్డును పట్టిన ఫ్యాన్స్
X
ఒకప్పుడు స్టార్‌ హీరోల సినిమాలు చేసిన వసూళ్లు మరియు వంద రోజులు ఎన్ని థియేటర్లు రెండు వందల రోజులు ఎన్ని థియేటర్లో ఆడింది అనే రికార్డులను లెక్క వేసుకునే వారు. కాని ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి రికార్డుగా చెప్పుకుంటున్నారు. ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా రికార్డుల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో ఏ హీరోకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు అనే విషయం మొదలుకుని ఏ హీరో గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు.. ఏ హీరోకు సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్స్ ఎక్కువగా రీచ్ అవుతున్నాయి.. ఎక్కువగా ట్వీట్స్ పడ్డ హ్యాష్‌ ట్యాగ్స్ ఏంటీ అంటూ రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఒక్కో హీరో అభిమాని ఒక్కో విధంగా తమ హీరో రికార్డును దక్కించుకున్నాడు అంటూ చెప్పడం జరుగుతుంది.

తాజాగా మహేష్ బాబు అభిమానులు ఒక ఇంట్రెస్టింగ్‌ రికార్డును వెదికి పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ స్టార్‌ హీరో కాని.. ఏ ఇండియన్‌ సినిమా సెలబ్రెటీ కాని ట్విట్టర్ లో దక్కించుకోలేని రికార్డును మహేష్ బాబు దక్కించుకున్నాడు అంటున్నారు. ఆ రికార్డు ఏంటీ అంటే మహేష్ బాబు చేసిన ట్వీట్స్ లో ఏకంగా 30 ట్వీట్స్ కు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఇతర ఏ సెలబ్రెటీకి కాని.. హీరోకు కాని ఈ స్థాయి లో లైక్స్ రాలేదు. ఇతర హీరోల్లో పది.. పదిహేను.. ఇరవై ట్వీట్ కు మాత్రమే లక్ష అంతకు మించి లైక్స్ వచ్చాయి. కనుక ఈ విషయంలో మా మహేష్‌ బాబు ఆల్ ఇండియా రికార్డును దక్కించుకున్నాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది మహేష్‌ బాబు క్రేజ్ కు ఆయన సోషల్‌ మీడియా స్టామినాకు అద్దం పడుతుంది అనడంలో సందేహం లేదు.

పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా చేయకుండా బాలీవుడ్ హీరోల రేంజ్ లో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ కలిగి ఉన్న సౌత్‌ స్టార్‌ మహేష్ బాబు అనడంలో సందేహం లేదు. ఇక మహేష్‌ బాబు సినిమా ల విషయానికి వస్తే గత ఏడాది సినిమాలు ఏమీ విడుదల చేయని మహేష్‌ బాబు ఈ ఏడాది సమ్మర్ లో సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఇక సమ్మర్‌ కు ముందే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా ఉంటుంది. ప్రస్తుతం దుబాయిలో ఫ్యామిలీతో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న మహేష్‌ బాబు తిరిగి వచ్చిన తర్వాత సర్కారు వారి పాట చివరి షెడ్యూల్‌ లో పాల్గొంటాడు. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కూడా సినిమా ను మహేష్‌ బాబు చేయాల్సి ఉంది.