Begin typing your search above and press return to search.

చైతన్యకి జరిగినట్లే అఖిల్ కి జరుగుతుందా...?

By:  Tupaki Desk   |   30 Aug 2020 5:47 PM GMT
చైతన్యకి జరిగినట్లే అఖిల్ కి జరుగుతుందా...?
X
అక్కినేని అఖిల్ ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో వాసు వర్మ - బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ పై నిర్మించనున్నారని తెలుస్తోంది. దీంతో అఖిల్ కి సరైన స్టోరీ డైరెక్టర్ దొరికితే తానేంటో బాక్సాఫీస్ కి రుచి చూపిస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయంలో 'సరైనోడు' దర్శకుడు రావడంతో ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నారట.

కాగా సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నాడని.. పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని రెండు రోజుల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వక్కంతం వంశీ పవన్ కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసాడని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అఖిల్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేస్తాడేమో అని అక్కినేని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇంతకముందు కూడా అక్కినేని నాగచైతన్యతో పరశురామ్ ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. 14 రీల్స్ బ్యానర్‌ లో 'నాగేశ్వరరావ్' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేపించారు. అయితే అదే సమయంలో మహేష్ బాబు నుంచి పిలుపురావడంతో పరశురామ్‌ చైతూ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టాడు. ఇప్పుడు సూరి కూడా పవన్ ప్రాజెక్ట్ కోసం అఖిల్ సినిమాని వదిలేస్తాడేమో అని అనుకుంటున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్లో 29వ చిత్రంగా రూపొందే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కరోనా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న కిష్ మూవీ నవంబర్ చివరి వారంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ తో పాటు హరీష్ శంకర్ సినిమా కంప్లీట్ చేసే సమయానికి సురేందర్ రెడ్డి అఖిల్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. మొత్తం మీద సురేందర్ రెడ్డి అఖిల్ సినిమాతో పాటు పవన్ మూవీ చేస్తాడని అర్థం అవుతోంది.