Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ కు పాము కాటు.. ఫ్యాన్స్ ఆందోళ
By: Tupaki Desk | 27 Dec 2021 4:28 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను అత్యున్నత స్థాయి వైధ్యులు పరీక్షిస్తున్నారు. ఆయన నార్మల్ గానే ఉన్నా కూడా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఇంత హడావుడికి కారణం ఏంటీ అంటే ఆయన్ను ఒక పాము కుట్టింది. విష రహిత పాము గా సల్మాన్ సన్నిహితులు చెబుతున్నారు. కుట్టిన సమయంలో సల్మాన్ కు కాస్త నొప్పి అనిపించినా ఆ తర్వాత బాగానే ఉన్నట్లుగా చెబుతున్నారు. విష రహిత పాము అవ్వడం వల్ల సల్మాన్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని ఆయన్ను కొన్ని గంటల పాటు అయినా పర్యవేక్షణలో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఆసుపత్రిలో ఉంచినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ ఎక్కువ శాతం తన ఫామ్ హౌస్ లో ఉంటాడు. అక్కడే శనివారం సల్మాన్ కు పాము కుట్టి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. శనివారం రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. ఆది వారం పూర్తిగా సల్మాన్ ను ఆసుపత్రిలో ఉంచినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగు పడింది కనుక ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడనక్కర్లేదు అంటూ ప్రకటన వచ్చింది. అభిమానులు మాత్రం ఆదివారం మొత్తం చాలా టెన్షన్ పడ్డారు. అసలు ఏం జరుగుతుందో క్లారిటీ లేక పోవడం.. సల్మాన్ ఆసుపత్రిలో ఉండటం తో అభిమానులు ఆసుపత్రి వర్గాల ప్రకటన కోసం వెయిట్ చేశారు. సల్మాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనే ప్రకటన వచ్చిన తర్వాత వారు రిలాక్స్ అయ్యారు.
సల్లూ భాయ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే రాధే సినిమా తో వచ్చాడు. ఇంకా ఆయన మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. దబాంగ్ సిరీస్ లో ఒక సినిమా ను చేయడంతో పాటు మరో సూపర్ హిట్ సినిమాకు కూడా సీక్వెల్ లో సల్మాన్ నటిస్తున్నాడు. వయసు పెరుగుతున్నా కొద్ది సినిమాల సంఖ్య ను సల్మాన్ ఖాన్ పెంచడం ఆశ్చర్యంగా ఉందంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు. తెలుగు లో సల్మాన్ ఖాన్ త్వరలో నటించబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. చిరంజీవి తో సల్మాన్ కలిసి నటిస్తాడని అంటున్నారు. ఆ సినిమా ఏంటీ.. ఎప్పుడు ఉంటుంది అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.