Begin typing your search above and press return to search.
శాతకర్ణితో అమ్మడి సుడి తిరిగిపోతుందా?
By: Tupaki Desk | 18 Dec 2016 3:30 PM GMTఅందం.. దానికి తగ్గ టాలెంట్ ఉంటే చాలు.. అవకాశాలు ఇచ్చేందుకు సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడూ వెనుకాడదు. ఆ వుడ్డూ.. ఈ వుడ్డూ అన్న తేడా లేకుండా ఏ వుడ్ అయినా సరే అక్కున చేర్చుకోవటం తెలుగోళ్లతో సహా సౌత్ లోని సినిమా వారికి అలవాటే. అందుకే బాలీవుడ్ బ్యూటీలే కాదు.. విదేశీ ముద్దుగుమ్ముల్ని సైతం.. మనకు తగ్గట్లుగా మార్చేసి వారికి విపరీతమైన క్రేజ్ తెచ్చేస్తుంటారు.
అలా తీసుకొచ్చిన బ్యూటీల్లో చాలామంది ఎంతగా పాగా వేశారన్నది కత్రినా.. అమీ జాక్సన్ లాంటోళ్లను చూస్తే తెలిసిపోతుంది. తాజాగా అలాంటి అందమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెదర్లాండ్స్ నుంచి ముంబయికి వచ్చిన ఫర్హా కర్మీ బాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకున్నా పెద్ద వర్క్ వుట్ కాలేదు. హిమేశ్ రేష్మియాతో తేరీ సరూర్ లో అమ్మడుకి అవకాశం వచ్చినా ఎవరి కంట్లోనూ పడలేదు.
అనంతరం ఈ హాట్ బ్యూటీ సాయి ధరంతేజ చేసిన తిక్కలో మెరిసింది. అమ్మడిలోని మెరుపును గుర్తించి ధ్రువలో అవకాశం ఇచ్చారు. అరవింద్ స్వామి గర్ల్ ఫ్రెండ్ గా అదరగొట్టటమే కాదు.. తన అందంతో అందరి మనసుల్లో రిజిష్టర్ అయిన ఈ భామకు మంచి మంచి అవకాశాలు రావటం ఖాయమన్న టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే తాజాగా విడుదల చేసిన బాలయ్యబాబు.. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ ట్రైలర్ లో తళుక్కున మెరిసింది.వార్ సీన్లలోనూ.. రొమాంటిక్ సీన్లలో కనిపించిన వైనం చూస్తే.. ఈ సినిమాలోనూ కీలక పాత్ర పోషించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. ఈ మెరుపు బ్యూటీ సుడి తిరిగినట్లేనని చెబుతున్నారు. శాతకర్ణితో ఆ విషయం తేలిపోవటం ఖాయమంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/