Begin typing your search above and press return to search.

పనిమనిషికి కరోనా..ఐసోలేషన్ లోకి సినీ ప్రముఖులు

By:  Tupaki Desk   |   15 April 2020 11:53 AM GMT
పనిమనిషికి కరోనా..ఐసోలేషన్ లోకి సినీ ప్రముఖులు
X
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ సోదరి.. ప్రముఖ జువెల్లరీ యజమాని ఫరాఖాన్ అలీ ఇంటి పనిమనిషికి కరోనా వైరస్ సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా ఫరాఖాన్ అలీ కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసి వారిని సెల్ఫ్ ఐసోలేషన్ లోకి ఉంచారు.

తాజాగా ఇదే విషయంపై ఫరాఖాన్ ట్వీట్ చేశారు. ‘మా ఇంటి పనిమనిషికి కరోనా సోకిందని తెలియగానే అధికారులు వేగంగా స్పందించి ఆసుపత్రికి తరలించారని.. ఈ సందర్భంగా వైద్యులు, అధికారులను ప్రశంసిస్తున్నాను’ అంటూ కొనియాడారు.

ప్రముఖ నటుడు అయిన సంజయ్ ఖాన్ పిల్లలే ఫరా - సుజనానే - సిమోన్ - నటుడు జాయేద్ ఖాన్ లు. వీరిలో ఫరాఖాన్ అలీ ఇంటి పనిమనిషికి కరోనా సోకడంతో వీరు కూడా ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాపించడంతో బాలీవుడ్ హీరోలు - సినీ సెలెబ్రేటీలు అంతా ఇంటికి పరిమితం అయ్యారు. పిల్లలతో కలిసి మాజీ భార్య సుసానేతో కలిసి హృతిక్ ఉంటున్నారు. లాక్ డౌన్ వరకూ తాము కలిసే ఉంటామని హృతిక్ తెలిపాడు.