Begin typing your search above and press return to search.

పక్కవాళ్ల గొడవల్తో నాకేం పని?

By:  Tupaki Desk   |   12 Sep 2017 4:41 AM GMT
పక్కవాళ్ల గొడవల్తో నాకేం పని?
X
తనను ప్రేమించానని చెప్పి మోసం చేశాడంటూ బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ పై బ్యూటీ కంగనా రనౌత్ బహిరంగంగానే యుద్ధం ప్రకటించింది. తమ ప్రేమ బంధం రహస్యంగానే ఉండిపోవాలని అతడు కోరుకున్నాడని.. అది ఇష్టం లేకే అతడి నుంచి దూరమయ్యానని మైకు ముందేసుకుని మరీ చెప్పింది. కంగన హీరోయిన్ గా నటించిన సిమ్రన్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్లకు వస్తున్న కంగన్ సిమ్రన్ సినిమా కన్నా హృతిక్ తో వివాదం మీదే ఎక్కువ గురిపెట్టి మాట్లాడుతోంది.

హృతిక్ - కంగనల వివాదంపై బాలీవుడ్ ఆచితూచి స్పందిస్తోంది. బాలీవుడ్ స్టార్ లేడీ డైరెక్టర్ ఫరా ఖాన్ గతంలో ఈ వివాదం గురించి మాట్లాడుతూ ‘ఆమె మహిళ’ కార్డు’ ప్రయోగిస్తోందంటూ కామెంట్ చేసింది. దీనిపైనా కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఫరా తాజాగా మరింత క్లారిటీ ఇచ్చింది. తన దృష్టిలో ఫెమినిజం అంటే సమానత్వమని చెప్పింది. ఫెమినిస్ట్ అనే మాట పుట్టేకన్నా ముందే తాను ఫెమినిస్టునని అంటూనే... ఆడ - మగ ఇద్దరు సమానమేని చెప్పుకొచ్చింది. తాను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించలేదనే విషయం గుర్తు చేసింది. నా కుటుంబ సభ్యులు కానప్పుడు ఇతరుల వ్యవహారాల్లో తాను వేలు పెట్టాల్సిన అవసరమే లేదని ఫరా క్లారిటీగా చెప్పింది.

మొత్తం మీద ఈ వ్యవహారంలో ఈసారి ఎలాంటి వివాదాలూ రాకుండా ఉండేలా ఫరా జాగ్రత్తగా రెస్పాండయ్యింది. అందుకే ఇది తనకు సంబంధం లేని వ్యవహారమని చెప్పకుండానే చెప్పింది. అవును మరి.. ఫైర్ బ్రాండ్ లా తయారైన కంగనతో కోరి వివాదాలు తెచ్చుకోవాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. ఈ వివాదాల మాటెలా ఉన్నా కంగన కెరీర్ మాత్రం భేషుగ్గా ఉంది. లేటెస్ట్ గా సిమ్రన్ రిలీజ్ కు రెడీగా ఉంది. తర్వాత తెలుగు దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో చారిత్రక చిత్రం మణికర్ణిక : ద క్వీన్ ఆఫ్ ఝాన్సీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు.