Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో ఇట్టాటి బెదిరింపులూ ఉంటాయ్
By: Tupaki Desk | 1 Dec 2017 7:30 AM GMTఏదైనా విషయంలో హర్ట్ అయితే దాన్ని ఎక్స్ ప్రెస్ చేసే తీరు.. ఒక్కోరికి ఒక్కోరకంగా ఉంటుంది. ఒకో ప్రాంతానికి ఒకో రీతిలో ఉండడంలో కూడా ఆశ్చర్యమేమీ లేదు. పైగా ఈ సోషల్ మీడియా.. టెక్నాలజీ అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ రూపంలో వచ్చాక.. జనాల నిర్లక్ష్యం(బద్ధకం లేదా కొవ్వు అని కూడా అనుకోవచ్చు) కూడా మరీ ఎక్కువవుతోంది.
చేతులతో రాసే ఉత్తరాలు పోయాయి.. వ్యక్తిగత పిలుపులు అంతరించాయి.. నోరారా చెప్పే ఫోన్ సంభాషణలు తగ్గాయి.. కొంతకాలం క్రితం వరకూ ఈమెయిల్స్ అయినా పెట్టేవారు.. ఇప్పుడు మరీ వాట్సాప్ లో ఓ మెసేజ్ షేర్ చేసి.. అదే అంతా అనుకోమంటున్నారు. ఇలాగే బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ కు ఎవరో పంపారట. దీన్ని ఉద్దేశించి 'ప్రియమైన సంస్కారం లేని ప్రజలారా.. నేను ఏదైనా ప్రీమియర్ లేదా పార్టీ లేదా ప్రివ్యూకి అటెండ్ కావాలని మీరు కోరుకుంటే.. వాట్సాప్ లో జనతా ఇన్ వైట్ ను పంపకండి. మీరేం నాకు ఫేవర్ చేయడం లేదు. కనీసం మీరు అయినా ఫోన్ చేసి పిలవాలి కదా. ఆ ఫోన్ చేయడానికి కూడా మీకు టైం లేకపోతే.. నేను మీ కోసం వచ్చే సమయం ఉంటుందని ఎలా అనుకుంటున్నారు' అంటూ బాగా గట్టిగానే చెప్పింది ఫరా ఖాన్.
ఈ రేంజ్ లో అదీ సోషల్ మీడియాలో చెప్పడం పొగరు అనే అంటారు కానీ.. బాలీవుడ్ లో ఈ మాత్రం ఇగోలు సహజమే. అయితే.. ఈ మెసేజ్ ని అదే వాట్సాప్ లోనే పెట్టచ్చు కదా.. ట్విట్టర్ లో ఎందుకు అని జనాలు తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు.