Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : కరణ్ పార్టీలో రెచ్చి పోయిన లేడీ కొరియోగ్రాఫర్‌

By:  Tupaki Desk   |   1 Jun 2022 6:30 AM GMT
క్లిక్‌ క్లిక్‌ : కరణ్ పార్టీలో రెచ్చి పోయిన లేడీ కొరియోగ్రాఫర్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్ జోహార్‌ 50వ పుట్టిన రోజు పార్టీ పూర్తి అయ్యి రోజులు గడుస్తున్నా కూడా అందుకు సంబంధించిన సందడి మాత్రం ఇంకా సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉంది. ఒక అవార్డు ఫంక్షన్‌ కు హాజరు అయిన రేంజ్ లో బాలీవుడ్‌ స్టార్స్‌ పదుల కొద్ది హాజరు అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వందల కొద్ది సెలబ్రెటీలు ఆ పార్టీలో సందడి చేసి మీడియా లో హడావుడి చేశారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కూడా కరణ్‌ జోహార్‌ బర్త్‌ డే పార్టీలో హడావుడి చేసింది. ఆమె తాజాగా తన ఫోటోలను షేర్ చేసింది. చాలా స్టైలిష్ లుక్ లో బర్త్‌ డే పార్టీకి ఆమె హాజరు అయ్యింది.

కరణ్‌ జోహార్‌ కు అత్యంత ఆప్తురాలుగా పేరున్న ఫరా ఖాన్ పార్టీ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు అంటూ ఆ సమయంలోనే మీడియా వర్గాల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది.

తాజాగా ఆమె ఫోటోలు బయటకు వచ్చాయి. వచ్చిన గెస్ట్ లతో పాటు కరణ్ జోహార్ తో ఆమె చేసిన హడావుడి ని ఆ ఫోటో ల్లో చూడవచ్చు. ఫరా ఖాన్‌ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి పార్టీలకు మరియు కార్యక్రమాలకు ఖచ్చితంగా హాజరు అవుతారు అనే టాక్ ఉంది. ఆమె ఇండస్ట్రీలో చాలా మందికి సన్నిహితురాలిగా పేరును దక్కించుకున్నారు. అందుకే అందరితో కూడా చాలా జోవియల్ గా ఉంటుంది.

కరణ్‌ జోహార్‌ బర్త్‌ డే పార్టీ లో జరిగిన హడావుడి తాలూకు వీడియోలు మరియు ఫోటోలు ఇంకా ముందు ముందు చాలానే వస్తాయంటూ బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పదుల కొద్ది స్టార్స్‌.. సూపర్ స్టార్స్ హాజరు అయిన బర్త్‌ డే పార్టీ ని గతంలో ఎప్పుడు జరగనంత గ్రాండ్ గా కరణ్ జోహార్‌ టీమ్ నిర్వహించారని తెలుస్తోంది. మన సౌత్ నుండి విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాథ్‌ లకు ఆ పార్టీలో పాల్గొనేందుకు ఆహ్వానం దక్కింది.