Begin typing your search above and press return to search.

గురు ద‌క్షిణ ఎంత బాగుంది!

By:  Tupaki Desk   |   6 Sep 2017 4:24 AM GMT
గురు ద‌క్షిణ ఎంత బాగుంది!
X
గురువంటే గుండ్రాయి కాదు!- అని ఓ తెలుగు సినిమాలో పాట మ‌న‌కు చెబుతుంది. అవును. ఈ ప్ర‌పంచాన్ని - ప్ర‌పంచ జ్ఞానాన్ని మ‌న‌కు చేరువ చేసేవారు, ప‌దిమందిలో ప‌రోక్షంగా వెన‌క ఉండి.. ప్ర‌త్య‌క్షంగా మ‌న‌కు గుర్తింపు తెచ్చి పెట్టేవారు గురువు! అలాంటి గురువుల‌ను స్మ‌రించుకునేందుకు, అలాంటి గురువుల‌కు న‌మ‌స్క‌రించుకునేందుకు వ‌చ్చిన అవ‌కాశ‌మే సెప్టెంబ‌రు 5. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్స‌వం. త‌మ త‌మ గురువుల‌ను స్మ‌రించుకుని, సంస్క‌రించుకునే రోజు. అంద‌రూ ఈ రోజున గురువుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి వారి నుంచి ఆశీర్వాదం పొందేందుకు త‌హ‌త‌హ లాడ‌తారు. జీవితంలో మ‌రిన్ని విజ‌యాల‌ను సాధించేలా దీవించ‌మ‌ని కోర‌తారు.

అయితే, ప్ర‌ఖ్యాత కొరియాగ్రాఫ‌ర్ ఫ‌రాఖాన్ త‌న గురు భ‌క్తిని ప్ర‌త్యేకంగా చాటుకుంది. ప్ర‌స్తుతం త‌న క‌ళ్ల‌ముందు లేక‌పోయినా.. త‌న గురువు మాత్రం త‌న గుండెల్లో ఉన్నాడ‌ని నిరూపించింది. అంతేకాదు, త‌న గురువుకు తాను ఎంత విలువ ఇస్తున్న‌దీ ఆమె చెప్ప‌క‌నే చెప్పింది. ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని డ్యాన్స్‌లో త‌న‌కు ఆస‌క్తి క‌ల‌గ‌డానికి కార‌ణ‌మైన మైకేల్ జాక్స‌న్‌ తో దిగిన ఫొటోను ఫ‌రాఖాన్ ఇన్‌ స్టాగ్రాంలో షేర్ చేశారు. తాను ఫొటో దిగింది మైకేల్ జాక్స‌న్ మైన‌పు బొమ్మ‌తో కాద‌ని, `సిర్కా 1999` స‌మ‌యంలో మైకేల్ జాక్స‌న్ హాజ‌రైన‌పుడు దిగిన ఫొటోగా ఆమె పేర్కొన్నారు.

దీంతో ఫ‌రా అభిమానులు ఆశ్చ‌ర్యానికి గురయ్యారు. `గ్రేట్‌` - `సూప‌ర్బ్‌` అంటూ కామెంట్లు కుమ్మ‌రించారు. ఫ‌రా ముంబైలో సోషియాల‌జీ చ‌దువుతున్న రోజుల్లోనే మైకేల్ జాక్స‌న్ `థ్రిల్ల‌ర్‌` ఆల్బం విడుద‌లైంది. అందులో మైకేల్ డ్యాన్స్ చూసి ఫ‌రా కొరియోగ్రాఫ‌ర్ అవ్వాల‌ని నిశ్చ‌యించుకుంద‌ట‌. త‌ర్వాత ఆమె `జో జీతా వ‌హీ సికంద‌ర్‌` సినిమాతో కొరియోగ్రాఫ‌ర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. త‌ర్వాత ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్‌ గా ఆరుకి పైగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు, ఎన్నో ఇత‌ర అవార్డులు గెల్చుకున్నారు. 2004లో `మై హూన్ న‌` సినిమాతో ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఓ అగ్ర‌శ్రేణికి చేరుకున్నా.. త‌న గురు భ‌క్తిని నేటికీ ప్ర‌ద‌ర్శించ‌డం, అందునా బాహ్య ప్ర‌పంచంలో లేని ప్ర‌పంచ డాన్స‌ర్‌ను ఇంత‌లా గౌర‌వించ‌డం నిజంగానే సూప‌ర్బ్‌గా ఉంది క‌దూ.