Begin typing your search above and press return to search.

ఇక ప్రేమపై శ్రద్ధ పెట్టేస్తాడా!?

By:  Tupaki Desk   |   8 March 2017 7:48 AM GMT
ఇక ప్రేమపై శ్రద్ధ పెట్టేస్తాడా!?
X
డైరెక్టర్- ప్రొడ్యూసర్-సింగర్ కం రైటర్ అయిన ఫరాన్ అక్తర్.. తాజాగా విడాకుల కార్యక్రమాన్ని పూర్తి చేసేసుకున్నాడు. ఏడాదికి పూర్వమే.. తన భార్య అధునా భబానితో విడాకులు తీసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసిన ఫరాన్ అక్తర్.. తాజాగా కోర్టు సాక్షిగా సంతకాల కార్యక్రమం పూర్తి చేశాడు. ఆ సమయంలో ఈ మాజీ భార్యాభర్తలు చాలా హుందాగా ప్రవర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అయితే.. ఇక అధునాకి విడాకులు ఇవ్వడం పూర్తయిపోవడంతో.. ఈ దర్శకుడు తన ప్రేమ వ్యవహారంపై శ్రద్ధ పెట్టేయచ్చని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. శ్రద్ధా కపూర్ తో ఫరాన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఆమె కూడా సేమ్ డిట్టోనే. ఆ మధ్య శ్రద్ధ తండ్రి.. ఈ విషయంలో బాగా రచ్చ చేశాడనే టాక్ కూడా ఉంది. ఏకంగా ఫరాన్ ఇంట్లోనే మకాం వేసేసిన శ్రద్ధా కపూర్ ని.. శక్తి కపూర్ బలవంతాన ఇంటికి తీసుకొచ్చాడని కూడా వార్తలు వచ్చాయి.

ఫరాన్ తో ప్రేమ విషయంలో శ్రద్ధా కపూర్ ఎప్పడూ నేరుగా స్పందించలేదు. అలాగని కాదనే మాట కూడా ఆమె నోటి నుంచి రాలేదు. ఇప్పుడు చట్టబద్ధంగా విడాకులు పూర్తయిపోయిపోవడంతో.. ఇక వీరిద్దరూ ప్రేమపై శ్రద్ధ పెట్టేసే ఛాన్సులున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/