Begin typing your search above and press return to search.

ఎఫైరే లేదు.. ఇంకా పెళ్లెక్కడ?

By:  Tupaki Desk   |   16 March 2016 3:30 PM GMT
ఎఫైరే లేదు.. ఇంకా పెళ్లెక్కడ?
X
బాలీవుడ్ లో ప్రస్తుతం బ్రేకప్ మేళా నడుస్తోంది. గత రెండేళ్లలో చాలామంది సెలబ్రెటీలు విడాకులు తీసుకున్నారు. లేటెస్టుగా ఫేమస్ డైరెక్టర్ కమ్ హీరో ఫర్హాన్ అక్తర్.. తన భార్య అధునా నుంచి డైవర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఫర్హాన్ కంటే అధునా ఐదేళ్లు పెద్దది. ఫర్హాన్ ముందు ఆమె చాలా ఏజ్డ్ లా కనిపిస్తుంది. కానీ వీళ్లిద్దరికీ ఎక్కడో కనెక్టయి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. బాలీవుడ్ లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ అని వీళ్లిద్దరికీ మంచి పేరుంది. చాలా మంచి అండర్ స్టాండింగ్ ఉన్నట్లుగా కనిపించిన ఈ జంట విడిపోవడంతో అందరూ షాకయ్యారు. దీనికి కారణాలేంటన్నది కూడా తెలియరాలేదు.

ఐతే అధునాతో విడిపోయిన కొన్ని రోజులకే ఫర్హాన్.. అదితి రావు హైదరీని పెళ్లాడబోతున్నట్లు రూమర్లు బయటికొచ్చాయి. వీళ్లిద్దరి మధ్య చాన్నాళ్ల నుంచే వ్యవహారం నడుస్తోందని.. ఫర్హాన్ అధునా నుంచి విడిపోవడానికి అదితినే కారణమని వార్తలొచ్చాయి. ఐతే చాన్నాళ్లుగా ఈ రూమర్లపై సైలెంటుగా ఉన్న ఫర్హాన్ ఈ మధ్య ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అదితితో ఎఫైరూ లేదని.. ఆమెను పెళ్లి కూడా చేసుకోవట్లేదని స్పష్టం చేశాడు.

‘‘నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు వదంతులు వస్తుంటాయో అర్థం కాదు. నా భార్య నుంచి విడిపోయిన తర్వాత అదితి రావు హైదరితోనే కాదు.. శ్రద్ధాకపూర్ - కల్కి కొచ్లిన్.. ఇలా ఎవరెవరితోనూ ఎఫైర్లు నడుపుతున్నట్లు వార్తలు సృష్టిస్తున్నారు. వాళ్లతో నేను చేసిన సినిమాల్లో మా కెమిస్ట్రీ నచ్చడం వల్ల మేం బయట కూడా కలిసి ఉంటే బాగుంటుందనుకుంటున్నారు. కానీ అది సినిమా.. ఇది జీవితం’’ అన్నాడు ఫర్హాన్. ఐతే మీడియా వాళ్లు అదితి పేరు మాత్రమే ప్రస్తావిస్తూ వార్తలు రాస్తే ఫర్హాన్ మాత్రం శ్రద్ధ - కల్కిల పేర్లు కూడా ప్రస్తావించడం విచిత్రమే.