Begin typing your search above and press return to search.

మ‌ర్రి చెట్టుకింద ప‌ర్హాన్-షిబానీ పెళ్లి భాజాలు

By:  Tupaki Desk   |   20 Feb 2022 7:30 AM GMT
మ‌ర్రి చెట్టుకింద ప‌ర్హాన్-షిబానీ పెళ్లి భాజాలు
X
బాలీవుడ్ ప్రేమ జంట‌లు ఒక్కోక్క‌రుగా వివాహ బంధంతో ఒక‌ట‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే క‌త్రినాకైఫ్‌- విక్కీ కౌశ‌ల్ కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అనంత‌రం వివాహం చేసుకున్నారు. రాజ‌స్థాన్ లో అంగ‌రంగ వైభంగా ఈ జంట వివాహం జ‌రిగింది.

అతి త్వ‌ర‌లోనే యంగ్ పెయిర్ ర‌ణ‌బీర్ కపూర్-ఆలియా భ‌ట్ కూడా ఒక‌టి కానున్నారు. ప్రేమ వ్య‌వ‌హారంలో కాస్త గొప్యంగా వ్య‌వ‌హ‌రించినా పెళ్లి విష‌యంలో మాత్రం ఎలాంటి దాప‌రికాలు లేకుండా జంట వ్య‌వ‌హ‌రిస్తోంది. స‌రైన ముహహుర్తం చూసుకుని పెళ్లి చేసుకోవ‌డ‌మే ఆల‌స్య‌మ‌ని రివీల్ చేసారు. దీంతో ఆ జంట వివాహం ఏ క్ష‌ణ‌మైనా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తేలిపోయింది.

అయితే తాజాగా మ‌రో జంట చ‌డిచ‌ప్పుడు లేకుండా సైలెంట్ గా రెండేళ్ల ప్రేమ‌కి పుల్ స్టాప్ పెట్టేసి త‌దుప‌రి ఘ‌ట్టానికి వెళ్లిపోయారు. బాలీవుడ్ హీరో..ద‌ర్శ‌కుడు ప‌ర్హాన్ అక్త‌ర్- షిబానీ దండ‌క‌ర్ స‌డెన్ ట్విస్ట్ ఇచ్చారు. ఇద్ద‌రు వివాహం చేసుకుని నూత‌న వ‌ధువ‌రులుగా నెట్టింట వ‌ర‌ల్ గా మారారు.

`ఖండాల` లో ఇద్ద‌రు నిరాడంబ‌రంగా ఒకరికొక‌రు దండ‌లు మార్చుకుని వివాహం చేసుకునున్నారు. పెళ్లికి కేవ‌లం అతికొద్ది మంది మాత్ర‌మే హాజ‌రైనట్లు తెలుస్తోంది. ఓ మర్రి చెట్టుకింద ఈ జంట వివాహం జరిగింది. వ‌ధువ‌రూలు ఇద్దరూ సంప్ర‌దాయ పెళ్లి వ‌స్ర్తాలు ధ‌రించారు. ప‌ర్హాన్ అక్త‌ర్ న‌లుపు రంగు ట‌క్సేడో ధ‌రించారు. ష‌బానీ ఎరుపు రంగు ఆఫ్ షోల్డ‌ర్ ఫిష్ క‌ట్ గౌను ధ‌రించి అందంగా క‌నిపిస్తోంది.

వేదిక బ్యాక్ గ్రౌండ్ ని అంద‌మైన ఎరుపు రంగు పూల‌తో అలంక‌రించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు పెళ్లి విషెస్ తెలియ‌జేస్తూ కామెంట్లు పెడుతున్నారు. షిబానీ దండేక‌ర్-ప‌ర్హాన్ అక్త‌ర్ రెండేళ్ల క్రితం ఓ టీవీషో లో క‌ల‌సుకున్నారు.

తొలుత స్నేహితులుగా ప్ర‌యాణం మొద‌లైంది. ఆ త‌ర్వాత ప్రేమికులుగా మారారు. షిబానీ దండేక‌ర్ బాలీవుడ్ లో హీరోయిన్ కాక‌పోయినా ఐపీఎల్ హాట్ యాంక‌ర్ గా అంద‌రికీ సుప‌రిచితురాలే.

హీరోయిన్లు క‌న్నా ఎక్కువ‌గా ఫేమ‌స్ అయింది. మోడ‌లింగ్ రంగంలోనూ ఆరితేరింది. అక్క‌డ నుంచి బుల్లి తెర‌పై అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం ప్రయివేట్ ఈవెంట్లు నిర్వ‌హిస్తోంది. ఇక ప‌ర్హాన్ అక్త‌ర్ కి ఇది వ‌ర‌కూ పెళ్లి అయింది. ప‌ర్హాన్ అక్త‌ర్ మొద‌టి భార్య అధునా భ‌జానీతో 2016 లో విడిపోయాడు.

ఇద్ద‌రి మ‌ధ్య మ‌నస్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో విడాకుల బంధంతో వేర‌య్యారు. ఆ త‌ర్వాత షిబానీతో రెండేళ్ల పాటు ప్ర‌యాణం న‌డిపారు. తాజాగా వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. ఇక న‌టుడిగా ప‌ర్హాన్ అక్త‌ర్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. భ‌ర్త స‌హ‌కారంతో షిబానీ బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది.