Begin typing your search above and press return to search.
ఒకే వంట మనిషిని చాలా కాలంగా షేర్ చేసుకున్న హీరోలు
By: Tupaki Desk | 2 Oct 2020 3:45 AM GMTదివంగత నటుడు సుశాంత్ కుక్ తో స్టార్ హీరో లింకులపై ఇటీవల బాలీవుడ్ సినీవర్గాల్లో రకరకాలుగా గుసగుసలు వినిపించాయి. దానిపై జాతీయ మీడియా కథనాలు వేడెక్కించాయి. సుశాంత్ సింగ్ వంట మనిషి కేశవ్ స్టార్ హీరో ఫర్మాన్ అక్తర్ ఇంట్లో కూడా వంట చేస్తుంటారని ఆ లింకులపైనా ఆరాలు తీస్తున్నారని ప్రచారం వేడెక్కించింది. అయితే ఈ కథనాల్ని ఫర్హాన్ అక్తర్ తాజాగా ట్విట్టర్ లో ఖండించారు.
ఇవి నిందాపూర్వకమైన ఆరోపణ. మరొక అబద్ధం. అంతగా మోసపోకుండా ఉండండి అంటూ ఫర్హాన్ ఘాటుగానే స్పందించాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించినప్పటి నుండి ఫర్హాన్ అక్తర్ స్నేహితురాలు షిబానీ దండేకర్ దివంగత నటుడి స్నేహితురాలు రియా చక్రవర్తికి మద్దతు ఇచ్చినందుకు ఎక్కువగా వివాదాల్లోకి లాగబడ్డారు. షిబాని `జస్టిస్ ఫర్ రియా` ట్యాగ్ ని ప్రచారం చేయగా దానికి ఫర్హాన్ తన మద్దతునిచ్చాడు. అయితే వంట మనిషిని షేర్ చేసుకోవడాన్ని అతడు తీవ్రంగా ఖండించాడు.
``నా దగ్గర కేశవ్ అనే వ్యక్తి పని చేయలేదు. ఆశ్చర్యకరంగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రసిద్ధి చెందిన ఒక నకిలీ న్యూస్ ఛానల్ తయారు చేసిన మరొక అబద్ధం ఇది. దయచేసి చాలా మోసపూరితంగా ఉండొద్దు. ఇది ఆపండి. ఒక యాంకర్ టీవీలో అలా అరుస్తాడు. కానీ అది నిజం కాదు`` అంటూ సీరియస్ టోన్ తో ఖండించాడు ఫర్హాన్. ఇకపోతే సుశాంత్ సింగ్ మరణించిన రెండ్రోజులకు బాధాతృప్త హృదయంతో ఫర్హాన్ ఒక కవితను రాశారు. రాబందుల రాజ్యం! అని అందులో ప్రస్థావించడం ఆశ్చర్యపరిచింది.