Begin typing your search above and press return to search.

ఫర్హానా టాక్ ఎలా ఉంది..?

By:  Tupaki Desk   |   14 May 2023 2:05 AM IST
ఫర్హానా టాక్ ఎలా ఉంది..?
X
తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ గా ఫర్హానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమధ్య వరుసగా ఓటీటీ సినిమాలు చేస్తూ వస్తున్న ఐశ్వర్య రాజేష్ ఫర్హానా తో థియేటర్ సినిమా చేసింది. తెలుగులో ఆల్రెడీ వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఫర్హానా అంటూ మరో కొత్త కథతో వచ్చింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ముస్లిం మహిళ గా నటించింది. భర్త పిల్లల కోసం ఆమె కాల్ సెంటర్ లో జాబ్ చేస్తుంది.

అలా జాబ్ చేస్తున్న ఆమె జీవితంలోకి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతనెవరో తెలియకుండానే ఆమె అతనితో ఎమోషనల్ అటాచ్ అవుతుంది. తెలియని వ్యక్తి కోసం ఆమె డైరెక్ట్ గా కలిసేందుకు కూడా సిద్ధమవుతుంది ఇంతలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఫర్హానా సినిమా. తన పాత్రలో ఐశ్వర్య మెప్పించింది. డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ సినిమా కథ బాగానే రాసుకున్నా ఎగ్జిక్యూషన్ లో తడపడినట్టు అనిపిస్తుంది.

సినిమా అంతా చాలా నాచురల్ గా అనిపిస్తుంది. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయినా కూడా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పడంతో పాటుగా క్లైమాక్స్ కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు. ఫైనల్ గా ఇది ఒక యావరేజ్ సినిమాగా నిలిచింది. డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలతో సూపర్ అనిపించుకుంటున్న ఐశ్వర్య రాజేష్ థియేటర్ సినిమా విషయంలో మాత్రం నిరాశపరుస్తుంది.

ఈ సినిమా తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ఒకటి రెండు ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేస్తే సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం లేదు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తన నటనతో మరోసారి ప్రేక్షకుల మనసులు గెలిచింది ఐశ్వర్య రాజేష్. హీరోయిన్ గా చేస్తూ మదర్ రోల్స్ చేయడం చాలా పెద్ద రిస్క్ అయినా కూడా ఐశ్వర్య అలాంటి పాత్రలు చేస్తూ సర్ ప్రైజ్ చేస్తుంది.