Begin typing your search above and press return to search.

బాల‌ జాతిర‌త్నం బ‌య‌టికొచ్చిందిలా..!

By:  Tupaki Desk   |   24 July 2021 1:30 AM GMT
బాల‌ జాతిర‌త్నం బ‌య‌టికొచ్చిందిలా..!
X
`జాతిర‌త్నాలు` సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన ఫ‌రియా అబ్దుల్లా న‌టిగా తొలి సినిమాతోనే స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా త‌న‌దైన చ‌బ్బీ లుక్ క్యూట్ అప్పియ‌రెన్స్ తో మైమ‌రిపించింది. సినిమా ఆద్యంతం న‌వీన్ పొలిశెట్టితో పాటు స్పాంటేనియ‌స్ కామెడీ పండించిన ఈ ట‌వ‌ర్ బ్యూటీ తెలుగు ప్రేక్ష‌కుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. తొలి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ఫరియాకు అది పెద్ద ప్ల‌స్ అయ్యింది.

24 ఏళ్ల‌ ఫరియా అబ్ధుల్లా పుట్టి పెరిగింది హైద‌రాబాద్ లోనే. ఇక్క‌డే స్ట‌డీస్ ని పూర్తి చేసింది. అటుపై టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ల‌క్కీ గా తొలి సినిమాతోనే క్రేజీ భామ‌గా వెలిగిపోతోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో రెండు సినిమాలున్నాయి. మ‌రోవైపు ఇత‌ర నాయిక‌ల్లానే సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. తాజాగా ఫ‌రియా అబ్దుల్లా చిన్న‌నాటి ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది.

స‌రిగ్గా ఆరేడేళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు ఫ‌రియా అబ్ధుల్లా ఎలా ఉండేదో ఈ ఫోటోలో క‌నిపిస్తోంది. క్యూట్ గా చ‌బ్బీగా ఇప్ప‌టి రూపంతోనే క‌నిపిస్తోంది. అంత‌గా అవేగా లుక్ లేదు. ఏజ్ ప‌ర‌మైన వేరియేష‌న్ మిన‌హా గుర్తు ప‌ట్ట‌లేనంత డిఫ‌రెన్స్ ఆ ఫోటోలో లేదు. తోపుడు పంటి వ‌రుస‌..రామ చిలుక‌ ముక్కు... క్యూట్ స్మైల్ తో చూప‌రుల‌ను ల‌వ్ లీగా ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫోటోని ఉద్దేశించి నెటిజ‌నులు జోరుగా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చిన్న‌ప్ప‌టి జాతిర‌త్నం అంటూ ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. ఫ‌రియా ఫోటో చూస్తుంటే చిన్న‌ప్ప‌టికీ..పెరిగి పెద్ద‌యిన‌ప్ప‌టికీ పెద్ద తేడా లేదని కామెంట్లు చేస్తున్నారు. ముఖంలో పెద్ద‌గా మార్పులు లేవ‌ని త‌మ వ్యూ చెబుతున్నారు. ఎత్తు..బ‌రువు శ‌రీంలో మార్పులు మాత్ర‌మే జ‌రిగాయంటూ అభిమానులు చాలా మంది అభిప్రాయ‌పడుతున్నారు.

మ‌రి ఈ ఫోటో ఎలా బ‌య‌ట‌కొచ్చిందంటే? నెట్టింట్లో నిత్యం అన్వేషించే అభిమానుల కంట ఇలా ప‌డింది. అంతే సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. మ‌రి ఈ పిక్ ఫరియా అబ్ధుల్లాదేనా? లేక ఫేక్ నా అన్న‌ది ఫ‌రియా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ఫోటోపై ఫ‌రియా స్పందించ‌లేదు.