Begin typing your search above and press return to search.

వాలు క‌ళ్ల‌తో వ‌ల‌లు వేస్తున్న చిట్టి

By:  Tupaki Desk   |   30 Jun 2021 11:30 PM GMT
వాలు క‌ళ్ల‌తో వ‌ల‌లు వేస్తున్న చిట్టి
X
వాలు క‌ళ్లతో వ‌ల‌లు వ‌స్తోంది. రింగుల కురుల‌తో మాయ చేస్తోంది. పొడుగు కాళ్ల‌తో సొగ‌సు ఆర‌బెడుతోంది. డ‌ఫెల్ బ్యాగీ ఫ్యాంటులో కొత్తందాన్ని ప‌రిచ‌యం చేస్తోంది. అలా బ్లాక్ షాడో డ్రెస్ లో హార్స్ రైడింగ్ కి రెడీ అవుతోంది! ఇంత‌కీ ఎవ‌రీ అందాల‌ చిన్న‌ది అంటే చిట్టి ఫ‌రియా అలియాస్ ఫ‌రియా అబ్ధుల్లా.

ఈ హైద‌రాబాదీ సోగ్గత్తెకు ఉన్న‌ట్టుండి అమాంతం బోయ్స్ లో క్రేజు పెరిగింది. జాతిర‌త్నాలు చిట్టిగా కుర్రాళ్ల గుండెల్లో తిష్ఠ వేసుకుని కూచుంది. గ‌త కొద్దిరోజులుగా ఇన్ స్టా వేదిక‌గా దుమారం రేపుతున్న చిట్టి ఫ‌రియా తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ ని షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది.

అలా లూజ్ బ్యాగీపై వైట్ టాప్ ధ‌రించి ఎంతో స్టైలిష్ గా జేబులో చేతులు పెట్టుకుని మ‌రీ నిలుచుంది ఫ‌రియా. వేరొక బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ లో డిజైన‌ర్ ఫ్రాకు ధ‌రించి గుర్రం మూపురంపై చేతిని ఉంచి స్టైలిష్ గా ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోల‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

ఇటీవ‌లే ఫ‌రియాకు మంచు కాంపౌండ్ నుంచి క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కింది. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్న ఢీ సీక్వెల్ కోసం ఫరియా అబ్దుల్లాను సంప్ర‌దించారు. విష్ణు స్వ‌యంగా ఈ టవ‌ర్ బ్యూటీని ఒప్పించార‌ట‌. ఆచితూచి అడుగులు వేస్తున్న ఫ‌రియా తెలివైన ఎంపిక‌ల‌తో కెరీర్ ని సాగించాల‌ని ప్లాన్ చేస్తోంది. ప్ర‌స్తుతం త‌న డ్యాన్సింగ్ యాక్టింగ్ స్కిల్స్ కి మ‌రింత ప‌దును పెడుతూ వ‌రుస‌గా క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం.