Begin typing your search above and press return to search.

తీన్మార్ స్టెప్పుల‌తో దుమ్ము రేపిన జాతిర‌త్నం!

By:  Tupaki Desk   |   7 Oct 2021 3:30 AM GMT
తీన్మార్ స్టెప్పుల‌తో దుమ్ము రేపిన జాతిర‌త్నం!
X
`జాతిర‌త్నాలు` చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన హైద‌రాబాదీ బ్యూటీ ఫ‌రియా అబ్ధుల్లా తెలుగు ప్రేక్ష‌కుల్లో భారీ ఫాలోయింగ్ ని పెంచుకున్న సంగ‌తి తెలిసిన‌దే. ఫ‌రియా న‌టించిన‌ తొలి సినిమాతోనే మంచి స‌క్సెస్ అందుకుని కుర్రకారులో క్రేజీ బ్యూటీగా వెలిగిపోయింది. దీంతో సోష‌ల్ మీడియాలో అమ్మ‌డికి భారీగా ఫాలోయింగ్ పెరిగింది. నాటి నుంచి ఎప్ప‌టికప్పుడు ఇన్ స్టా లో అభిమానులకు ట‌చ్ లో ఉంటూ అప్ డేట్స్ ఇస్తోంది ఫ‌రియా.

తాజాగా ఫరియా తీన్మార్ స్టెప్పులతో దుమ్ముదులిపేసింది. సంప్ర‌దా యంగా ప‌ట్టుచీర క‌ట్టుకుని న‌డిరోడ్డుపై తీన్మార్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. ప్ర‌స్తుతం ఆ వీడియో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఫ‌రియా స్టెప్పుల‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ``డ్ర‌మ్ ప‌వ‌ర్ ఇదే.. ఆ సౌండ్ కు న‌న్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా`` అని పోస్ట్ చేసింది.

ఇక ఫ‌రియాకు డాన్సు అంటే చిన్ననాటి నుంచి పిచ్చి... ఇప్ప‌టికే కొన్ని డాన్సు వీడియోల‌ను ఇన్ స్టాలో షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వాటిక‌న్నా తీన్మార్ డాన్సు మ‌రింత వైర‌ల్ గా మారుతోంది. ఇక ఫ‌రియా సినిమాల‌ విష‌యాల‌కి వ‌స్తే ప్ర‌స్తుతం మంచు విష్ణు న‌టిస్తోన్న `ఢీ` సీక్వెల్ లో హీరోయిన్ గా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.