Begin typing your search above and press return to search.

ఫొటో టాక్: ఏంజెల్ ఫారియా.. బ్యూటీఫుల్ షో!

By:  Tupaki Desk   |   4 Jan 2023 2:30 AM GMT
ఫొటో టాక్: ఏంజెల్ ఫారియా.. బ్యూటీఫుల్ షో!
X
కొంతమంది హీరోయిన్స్ దురదృష్టం ఏమిటో కానీ మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటారు కానీ ఆ తర్వాత మళ్లీ మరో అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడుతుంది. జాతి రత్నాలు సినిమా సాధించిన విజయంతో చిట్టిగా మంచి క్రేజ్ అందుకున్న ఫారియా అబ్దుల్లా తప్పకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఇంతవరకు సరైన అవకాశం దొరకలేదు.

మొన్న ఆ మధ్యలో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే ఒక సినిమా చేసింది కానీ అదేమీ అది దారుణంగా డిజాస్టర్ అయింది. అంతేకాకుండా మంచు విష్ణు సినిమాలో కూడా నటించబోతోంది అని శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ సీక్వెల్ రాబోతుంది అని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఆగిపోవడంతో మళ్లీ బ్యూటీ మీడియం రేంజ్ హీరోల తో నటించడానికి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక గ్లామర్ ప్రెసెంటేషన్లో మాత్రం ఫారియా ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల కాలంలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ అయితే దక్కుతోంది.

ఎందుకంటే విభిన్నంగా గ్లామర్ హైలెట్ అయ్యేలా ఫోటోషూట్స్ నిర్వహిస్తోంది. రీసెంట్ గా అమ్మడు వైట్ డ్రెస్ లో ఒక ఏంజెల్ లా స్టిల్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

అందులో మరి వల్గర్ గా లేకుండా చాలా బ్యూటిఫుల్ గా గ్లామర్ ను హైలైట్ చేసింది. ఏదేమైనా కూడా ఈ బ్యూటీ మాత్రం చాలా అందంగా ఉంది అని మంచి సినిమా తగిలితే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది అని మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఇక ఫారియా అబ్దుల్లా ప్రస్తుతం తమిళం తెలుగులో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ లో కూడా రెండు ప్రాజెక్టులు చర్చలు దశలో ఉన్నట్లు సమాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.