Begin typing your search above and press return to search.

ఇన్ స్టాలో దంచి కొడుతున్న చిట్టెమ్మ‌!

By:  Tupaki Desk   |   15 Nov 2021 11:09 AM GMT
ఇన్ స్టాలో దంచి కొడుతున్న చిట్టెమ్మ‌!
X
ప‌వ‌ర్ స్టార్ వవ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయకుడిగా న‌టిస్తోన్న `భీమ్లా నాయ‌క్` ప్ర‌చార చిత్రాలు సోష‌ల్ మీడియాని ఏ రేంజ్ లో షేక్ చేస్తున్నాయో తెలిసిందే. ఇక `లాలా భీమ్లా` లిరిక‌ల్ సాంగ్ మాస్ స‌హా అన్ని వ‌ర్గాల్లోకి జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. ఈ బీట్ కి స్టెప్పులు వేయ‌ని అభిమాని లేడు. ఇక న‌వ‌త‌రం నాయిక‌లు....ప‌వ‌న్ ఫాలోవ‌ర్స్ ఓ రేంజ్ లో ఈ పాట‌కి ప్ర‌చారం క‌ల్పించారు. దాంతో పాటు వాళ్లు ఇన్ స్టాలో ఫేమ‌స్ అయ్యారు.

తాజాగా `జాతిర‌త్నాలు` ఫేం ఫ‌రియా అబ్దుల్లా కూడా ఆ పాట‌కు త‌న‌దైన శైలిలో అద‌ర‌గొట్టేసింది. లాలా భీమ్లా దంచికొట్టు అంటూ ఇన్ స్టాని త‌న‌దైన స్టెప్పుల‌తో హోరెత్తిస్తోంది. త‌న‌తో పాటు డాన్స్ మాష్ట‌ర్ కూడా తోడ‌వ్వ‌డంతో ఫ‌రియా పోటీ ప‌డి డాన్స్ చేసింది. ఫ‌రియా ముఖంలో ఎక్స్ ప్రెష‌న్స్ చ‌క్క‌గా క్యారీ అయ్యాయి.

దానికి సంబంధించి న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ గా మారింది. ఫ‌రియా ఫాలోవ‌ర్స్ డాన్స్ లో మంచి గ్రేస్ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీ ఇటీవ‌లే `మోస్ట్ ఎలిజిబు ల్ బ్యాచిల‌ర్` తో మ‌రో స‌క్సెస్ అందుకుంది. అయితే ఇందులో ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాముఖ్యత లేదు.