Begin typing your search above and press return to search.

నా జాకెట్ కూడా వేసుకో.. అప్పుడు చీర ఇచ్చేస్తాః హీరోయిన్

By:  Tupaki Desk   |   8 March 2021 7:21 AM GMT
నా జాకెట్ కూడా వేసుకో.. అప్పుడు చీర ఇచ్చేస్తాః హీరోయిన్
X
యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి న‌టించిన లేటెస్ట్ మూవీ ‘జాతి రత్నాలు’. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫ‌రియ‌దా అబ్దుల్లా హీరోయిన్‌. పేరుతోనే ఆకట్టుకున్న ఈ సినిమా.. ట్రైల‌ర్ తో ఆడియ‌న్స్ ను మ‌రింత‌గా అట్రాక్ట్ చేసింది. పాట‌లు కూడా శ్రోత‌ల‌ను అల‌రిస్తున్నాయి. శివ‌రాత్రి శుభాకాంక్ష‌లతో ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కాబోతోంది.

దీంతో ప్ర‌మోష‌న్స్ పై దృష్టి పెట్టింది యూనిట్‌. ఇందులో భాగంగా ఆదివారం వ‌రంగ‌ల్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ సంద‌ర్భంగా హీరో న‌వీన్ పొలిశెట్టి-హీరోయిన్ ఫ‌రియా మ‌ధ్య ఫ‌న్నీ టాక్స్ న‌డిచాయి.

ఫ‌రియా మాట్లాడుతుండ‌గా.. మ‌ధ్య‌లో ఎంట‌రైన‌ యాంక‌ర్ సుమ‌.. ‘‘ఈ అంద‌మైన అమ్మాయి మాట్లాడుతుంటే.. ఇక్క‌డ ఉన్న‌వారంతా గోల చేయ‌కుండా ఎలా వింటున్నారో చూడండి’’ అన్నది. దీనికి స్పందించిన నవీన్.. ‘‘ఇప్పుడు ఈ అమ్మాయి ఏ,బీ,సీ,డీలు మాట్లాడినా.. రెండు గంటలు కూర్చొని వింటారు’’ అన్నాడు. అవును నిజమే అన్నట్టుగా ..‘‘ఇలాంటి టీచర్స్ ఉంటే సబ్జెక్ట్స్ ఎందుకు రావు చెప్పు నవీన్’’ అంది సుమ.

దీనికి మళ్లీ నవీన్ స్పందిస్తూ.. ఫరియాను ఉద్దేశించి ‘‘నేను చెప్పాను.. ఈ చీర నాకు ఇవ్వమని’’ అన్నాడు. సరదాగా కౌంటర్ ఇచ్చిన ఫరియా ‘‘చీర కాదు.. బ్లౌజ్ కూడా వేసుకోవాలి’’ అంది. ఈ విధంగా జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ హాయిగా సాగిపోయింది.