Begin typing your search above and press return to search.

బాబోయ్‌ జాతిరత్నాలు ముద్దుగుమ్మ డ్రీమ్ రోల్‌

By:  Tupaki Desk   |   29 March 2021 9:30 AM GMT
బాబోయ్‌ జాతిరత్నాలు ముద్దుగుమ్మ డ్రీమ్ రోల్‌
X
జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా నాచురల్‌ బ్యూటీ అంటూ ప్రశంసలు దక్కించుకుంది. జాతి రత్నాలు సూపర్‌ హిట్‌ నేపథ్యంలో ఆమెకు కూడా మంచి క్రెడిట్ దక్కింది అనడంలో సందేహం లేదు. ఇక టాలీవుడ్‌ లో టాలెస్ట్‌ హీరోయిన్‌ అని కూడా ఈ అమ్మడు పేరు దక్కించుకుంది. ఈమె తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని ఆశ పడుతోంది. ఇదే సమయంలో ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు వస్తే నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా పేర్కొంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన డ్రీమ్‌ రోల్‌ గురించి ఇంకా ఇతర విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింద.ఇ

ఫరియా డ్రీమ్‌ రోల్‌ ఏంటీ అంటూ ప్రశ్నించగా సైకోగా నటించాలని కోరిక. అలాంటి పాత్రలో నటించినప్పుడు మనలోని నటన బయటకు వస్తుంది. మన ప్రతిభ పూర్తిగా బయటకు తీసేందుకు అలాంటి నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలను చేయాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. డ్రీమ్‌ రోల్‌ ఇలాంటివి కూడా ఉంటాయా.. బాబోయ్‌ ఫరియా ఏంటీ ఈ ఆలోచనలు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాను సినిమాల సంఖ్య స్పీడ్ గా పెంచుకోవాలని భావించడం లేదు... మంచి సినిమాలు మాత్రమే చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా ఆమె చెప్పింది. ఇక ఫరియా తదుపరి సినిమా ఏంటీ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లుగా ఆమె పేర్కొంది.