Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: కాలేజ్ లో దొరికిన జాతిరత్నం..!
By: Tupaki Desk | 4 March 2021 3:30 AM GMTటాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇటీవల ట్రెండ్ మారింది. ప్రతిభ ఉంటే తెలుగమ్మాయిలను అవకాశాలు వెతుక్కుని మరీ వస్తున్నాయి. ఇదిగో ఈ తెలుగు అమ్మాయి అలానే కథానాయికగా అవకాశం అందుకుంది. ఇప్పుడు అదృష్టం పరీక్షించుకుంటోంది.
ఇటీవల జనాలను విశేషంగా ఆకర్షిస్తున్న `జాతి రత్నాత్నలు` చిత్రంలో తనకు ఆఫర్ ఎలా వచ్చిందో వెల్లడించింది తెలుగమ్మాయ్ ఫరియా. ఫరియా అబ్ధుల్లా తన నేపథ్యం సహా తొలి ఆఫర్ ఎలా వచ్చిందో వివరించారు. ``స్వస్థలం హైదరాబాద్. నేను థియేటర్ ఆర్టిస్ట్ ని.. డాన్స్.. విజువల్ ఆర్టిస్ట్.. పెయింటింగ్ .. ఇలా చాలా విద్యలు తెలుసు. సినిమాల్లోనూ ప్రయత్నిస్తున్నాను. జాతి రత్నాలు నా మొదటి చిత్రం. ఇందులో చిట్టి అనే పాత్రను పోషిస్తున్నాను`` అని వెల్లడించారు.
అసలు ఆడిషన్ ఎలా జరిగింది? అన్నదానికి సమాధానమిచ్చారు. దర్శకనిర్మాత నాగ్ అశ్విన్ మా లయోలా కాలేజీకి ఓ ఈవెంట్ ముఖ్య అతిథిగా వచ్చారు. నేను ఆ కాలేజీకి అల్యూమ్నీని. అతను ఆడిషన్ లో ఎంపిక చేశారు. నేను చిన్న మూగ.. వెర్రి అమ్మాయిలా.. కొద్దిగా ప్రేమగల స్మార్ట్ చిట్టి పాత్రను పోషిస్తున్నాను`` అని ఫరియా చెప్పారు. డైలాగ్స్ సహా చాలా విషయాల్లో హీరో నవీన్ పోలిశెట్టి సహాయం చేశారని తెలిపారు.
నవీన్ పోలిశెట్టి- ప్రియదర్శి పులికొండ- రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కె వి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని స్వప్న సినిమా(మహానటి నిర్మాతలు) పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా `జాతి రత్నలు` మార్చి 11న విడుదలవుతోంది. మార్చి 4న ప్రభాస్ ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు.