Begin typing your search above and press return to search.

చిట్టీ మ‌రో ఆఫ‌ర్‌ ప‌ట్టేసింది

By:  Tupaki Desk   |   7 Jan 2022 11:46 AM GMT
చిట్టీ మ‌రో ఆఫ‌ర్‌ ప‌ట్టేసింది
X
పొడుగు కాళ్ల సుంద‌రి ఫ‌రియా అబ్దుల్లా `జాతి ర‌త్నాలు` చిత్రంతో పాపుల‌ర్ అయింది. క్రేజీ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తూ అనుదీప్ డైరెక్ష‌న్‌లో చేసిన ఈ చిత్రం ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఓవ‌ర్సీస్ లోనూ వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించి ట్రేడ్ వ‌ర్గాల‌నే షాక్ కు గురిచేసింది. ఈ చిత్రంలో చిట్టిగా క‌నిపించి తొలి చిత్రంతోనే ఆక‌ట్టుకుంది ఫ‌రియా అబ్దుల్లా. ప్ర‌భాస్ ని మించే హైట్, అంద‌మైన రూపం ఈ భామ సొంతం.

అంతే కాకుండా త‌న‌దైన స్మైల్ తో న‌వీన్ పొలిశెట్టితో క‌లిసి మెస్మ‌రైజ్ చేసింది. అయితే ఈ మూవీ త‌రువాత `బంగార్రాజు`లో ప్ర‌త్యేక గీతంలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుందే కానీ క్రేజీ స్టార్ తో క‌లిసి న‌టించే అవ‌కాశాన్ని మాత్రం పొంద‌లేక‌పోయింది. ఇలాంటి మాట‌లు వినిపిస్తున్న వేళ మాస్ మ‌హారాజా ర‌వితేజ .. ఫరియాకి అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చాడు. ఆయ‌న న‌టిస్తున్న `రావ‌ణాసుర‌`లో ముగ్గురు హీరోయిన్ లు న‌టిస్తుండ‌గా అందులో ఓ హీరోయిన్‌గా ఫరియారు అవ‌కాశం ల‌భించింది. ఈ మూవీ జ‌న‌వ‌రి 14న ప్రారంభం కాబోతోంది.

ఇదిలా వుంటే తాజాగా ఫ‌రియా మ‌రో ఛాన్స్‌ని ద‌క్కించుకుంది. అయితే ఇది సోలో హీరోయిన్ రోల్‌. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ మాంచి స్పీడుమీదున్న సంతోష్ శోభ‌న్ ఇందులో హీరో. ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మేర్ల‌పాక గాంధీ ఇటీవ‌ల హీరో నితిన్ తో బాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అంధాదున్‌` ఆధారంగా `మాస్ట్రో` ని రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే.

త‌మ‌న్నా, న‌భా న‌టేష్ న‌టించిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. దీంతో స్టార్ హీరోల‌తో కాకుండా త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ హీరో సంతోష్ శోభ‌న్ తో ప్లాన్ చేశారు మేర్ల‌పాక గాంధీ. ఈ చిత్రాన్ని ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌బోతోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ బ‌య‌టికి రానుంద‌ని తెలిసింది.