Begin typing your search above and press return to search.
నడుం మీదికి వచ్చేసిన ఫ్యాషన్ డిజైనర్
By: Tupaki Desk | 6 April 2017 11:12 AM GMTఅప్పట్లో ‘లేడీస్ టైలర్’ సినిమా ఒక సంచలనం. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఆ చిత్రంలో సెన్సేషనల్ హిట్టయింది. ఆ సినిమాను కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. సినిమాలో శృంగార రసం శృతి మించిందని.. అమ్మాయిల్ని కొంచెం వల్గర్ గా చూపించారని విమర్శలు వచ్చాయి. ఐతే వినోదం మాటున అవన్నీ కొట్టుకుపోయాయి. సినిమా అన్ని వర్గాల ఆదరణ పొందింది. సీన్ కట్ చేస్తే.. ‘లేడీస్ టైలర్’ వచ్చిన మూడు దశాబ్దాలకు దానికి కొనసాగింపుగా ‘ఫ్యాషన్ డిజైనర్’ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా మొదలైనపుడు అంతగా ఆసక్తి లేదు కానీ.. దీని ప్రి లుక్ రిలీజయ్యాక ఈ సినిమా హాట్ టాపిక్ అయింది.
అమ్మాయి చెస్ట్ దగ్గర కొలతలు తీస్తున్న జనాల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఈ లుక్ విషయంలో మంచు లక్ష్మి లాంటి కొందరి నుంచి విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. అది సినిమా ప్రమోషన్ కు బాగానే ఉపయోగపడింది. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది. ప్రి లుక్ లో చెస్ట్ దగ్గర కొలతలు తీస్తున్న ఫ్యాషన్ డిజైనర్.. ఈసారి హీరోయిన్ నడుం దగ్గరికి వచ్చేశాడు. ఆ హీరోయిన్ ఎవరో కూడా రివీలైపోయింది. అలియాస్ జానకి.. రన్ సినిమాల్లో నటించిన అనీషా ఆంబ్రోసే ఆ అమ్మాయి. అనీషా నడుం కొలతలు సుమంత్ అశ్విన్ తీస్తుంటే.. మా వంతు ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మిగతా ఇద్దరు హీరోయిన్లు మనాలి రాథోడ్.. మానస హిమవర్ష. మొత్తానికి ప్రి లుక్ లాగే ఫస్ట్ లుక్ కూడా కుర్రాళ్ల దృష్టిని బాగానే ఆకర్షించేలా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/