Begin typing your search above and press return to search.
ఫ్యాషన్ డిజైనర్ - మ్యూజిక్ రివ్యూ
By: Tupaki Desk | 18 May 2017 5:52 AM GMTవంశీ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ ఇప్పటికే జనాల్లో బోలెడంత ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూవీ సాంగ్స్ దాదాపుగా అన్నీ ఛార్ట్ బస్టర్స్ గా కూడా నిలిచి సందడి చేస్తున్నాయి. మణిశర్మ అందించిన సంగీతం శ్రోతలను బాగా ఆకట్టుకుంటోంది.
'పాపి కొండల్లో' అంటూ సాగే మొదటి పాట 80ల కాలతో పాటు లేటెస్ట్ జనరేషన్ ను కూడా గుర్తు చేస్తూ సాగుతుంది. చైతన్య ప్రసాద్ రాసిన పాటను శ్రీకృష్ణ.. గీతామాధురి పాడారు. 'రవి వర్మ చిత్రమా' అంటూ సాగే రెండో పాట ప్రారంభంలోనే ఒకనాటి రొమాంటిక్ స్టయిల్ గుర్తు చేస్తుంది. సింపుల్ గా అనిపించే లిరిక్ క్యాచీగా ఉంటుంది. మూవీ థీమ్ కి తగినట్లుగా ఈ పాట సాగుతుంది. 'అన్వేషణ' అంటూ సాగే పాట మన్మథ రేఖ గల ఓ కుర్రాడి వెతుకులాట అన్నమాట. సిట్యుయేషనల్ గానే ఈ పాట కూడా అనిపిస్తుంది.
'మేఘాలే తేలే నాలోన' అంటూ సాగే పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనదైన స్టైల్ మెలోడీ టచ్ ఇచ్చాడు. అలాగే వంశీ స్టైల్ సాహిత్యం ఇందులో వినిపిస్తుంది. 'కనులేమిటో' అంటూ' ఆల్బంలో చివరి పాట వినిపిస్తుంది. వినేందుకు ప్రేమకథ చిత్రంలోని దేవుడు కరుణిస్తాడని అనే పాటను గుర్తు చేస్తుంది ఈ పాట. హీరో హీరోయిన్లు తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకుంటున్నట్లుగా ఈ పాట అనిపిస్తుంది. మొత్తం మీద పాటలన్నీ వంశీ స్టైల్ కు మణిశర్మ ఒదిగి పాటలు కంపోజ్ చేసినట్లుగా అనిపించడం ఖాయం. ఒక ఆల్బంలో అన్ని పాటలను ఇలా ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం ప్రశంసనీయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/