Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఈ డిజైనర్ మరో మన్మథుడే

By:  Tupaki Desk   |   21 May 2017 5:54 AM GMT
ట్రైలర్ టాక్: ఈ డిజైనర్ మరో మన్మథుడే
X
సీనియర్ దర్శకుడు వంశీ మూవీ అనేగానే చాలామంది ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి మొదలైపోతుంది. ఇండస్ట్రీలో కూడా అంచనాలు పెరుగుతాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండానే తన లేటెస్ట్ మూవీ ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ ను రెడీ చేసేశాడు దర్శకుడు వంశీ. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

అప్పటి లేడీస్ టైలర్ ఛాయలతోనే ఈ ఫ్యాషన్ డిజైనర్ ఉంటుందని ముందే రివీల్ చేసేశారు. ఇప్పుడు ముగ్గురు ముద్దుగుమ్మలతో హీరో సుమంత్ అశ్విన్ రొమాంటిక్ దృశ్యాలను ట్రైలర్ లో మరిన్ని చూపించారు. రెండు నిమిషాల పాటు ట్రైలర్ ఉన్నా.. వంశీ సినిమాలకు ప్రధాన బలం అయిన పాటల్లోని సన్నివేశాలే ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. వంశీ నుంచే ఎక్స్ పెక్ట్ చేసే ఎలాంటి ఎలిమెంట్ కాలేదనే సంగతి ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సాఫీగా నడిచిపోతున్న స్టోరీలోనే.. ఓ చిన్నపాటి విలనిజంను కూడా మిక్స్ చేయడం ఈ దర్శకుడి స్పెషాలిటీ.

మన్మథ రేఖతో అమ్మాయిలను వశపరచుకునే హీరోకు.. చివర్లో కాసిన్ని కష్టాలు కూడా తప్పవు. ఇక లేడీస్ టైలర్ లో బాగా ఫేమస్ అయిన 'జమ జచ్చ' డైలాగ్ ను ఫ్యాషన్ డిజైనర్ లో వాడారు. ఓ వ్యక్తి మోకాళ్ల మీద కూర్చున్నట్లుగా ఉన్న మ్యానికీన్ కు లేడీస్ జీన్స్ వేసి.. కుండీలా వాడడం లాంటి కాన్సెప్ట్ లు వంశీ సినిమాల్లో మాత్రమే కనిపించే క్రియేటివిటీ. ఇలాంటి మరిన్ని విచిత్రాలను సినిమాలో చూపించడం ఖాయం అనుకోవచ్చు. మొత్తం మీద ఫ్యాషన్ డిజైనర్ థియేట్రికల్ ట్రైలర్.. అప్ డేటెడ్ లేడీస్ టైలర్ ను అనిపించడంలో ఆశ్చర్యం లేదు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/