Begin typing your search above and press return to search.

ఆ గెటప్ లో గర్భిణిగా చూపించాడు

By:  Tupaki Desk   |   10 May 2017 11:46 AM GMT
ఆ గెటప్ లో గర్భిణిగా చూపించాడు
X
టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్స్ లో వంశీ పేరు తప్పకుండా ఉంటుంది. కాటన్ శారీ.. పెద్ద బొట్టు.. గోదావరి ఒడ్డు ఇలాంటివన్నీ వంశీ బ్రాండ్ మార్కులు. ఆయన పాటలన్నీ కూడా గోదావరి అలలపై పడవ ప్రయాణంలానే ఉంటాయి. దశాబ్దాలుగా వంశీ స్టయిల్ ఇలానే ఉంది. ఇటీవల కాలంలో వంశీకి కమర్షియల్ సక్సెస్ రాలేదు. అందుకే తొలిరోజుల్లో తనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన లేడీస్ టైలర్ కాన్సెప్ట్ ఈ తరానికి నచ్చేలా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాను తీస్తున్నారు. మధుర శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్ నటిస్తున్నారు.

సాధారణంగా వంశీ సినిమాల్లో హీరోలకంటే హీరోయిన్లకే ఎక్కువ పేరొస్తుంది. ఆయన హీరోయన్లను చూపించే విధానం అటువంటిది మరి. ఈసారి ఫ్యాషన్ డిజైనర్ లో అనీషాను చూపించిన విధానం కాస్త వింతగాను, ఇంకాస్త విడ్డూరంగానూ అనిపిస్తోంది. నిండు గర్భిణిగా ఉన్న ఆమె గోదావరి ఒడ్డున క్లాసికల్ డ్యాన్సర్ గెటప్ లో కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్, సిల్వర్ కలర్ డ్రస్ లో ఉన్న హీరో హీరోయిన్లిద్దరూ క్లాసికల్ డ్యాన్సర్ గెటప్స్ లో కనిపించడం విశేషం. ఇంతకుముందు చాలా సినిమాల్లో హీరోయిన్లను శాస్త్రీయ నృత్యం చేసే గెటప్ లలో చూపించినా నెలలు నిండిన గర్భిణిని ఇలా ఇదివరకెన్నడూ చూపించలేదు. ఈ ఆలోచన కొందరు అద్భుతమని అంటుంటే.. మరికొందరు పిచ్చి ఆలోచనగా కొట్టిపారేస్తున్నారు.

వాస్తవానికి ఈ పాటలో మనిషి పుట్టుక నుంచి మరణం వరకు విభిన్న దశలను వైవిధ్యంగా చూపించబోతున్నారట. అందులో భాగంగానే ఈ సీన్ వస్తుందనేది చిత్రవర్గాల సమాచారం. ఈ స్టైల్ ఫిల్మ్ మేకింగ్ వంశీకి ఒకప్పుడు పేరుతెచ్చినా ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలేం రాలేదు. మరి ''ఫ్యాషన్ డిజైనర్'' బాక్సాఫీస్ ను ఎంతవరకు ఆకట్టుకోగలడో వేచి చూడాలి.