Begin typing your search above and press return to search.

సూసైడ్ కు ముందు చివరగా హీరోయిన్ తో మాట్లాడిన ఫ్యాషన్ డిజైనర్

By:  Tupaki Desk   |   13 Jun 2022 6:19 AM GMT
సూసైడ్ కు ముందు చివరగా హీరోయిన్ తో మాట్లాడిన ఫ్యాషన్ డిజైనర్
X
దేశంలో టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరైన ప్రత్యూష ఉదంతం సంచలనంగా మారటం తెలిసిందే. తీవ్రమైన డిప్రెషన్ తో పాటు జీవితాన్ని తాను అనుకున్నట్లుగా జీవించలేని నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తన బొటిక్ లోని బాత్రూంలో కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్నిచార్ కోల్ గ్రిల్ లో ఉంచి.. ఆ పొగతో ఊపిరి ఆడకుండా చేసి చనిపోయిన ఉదంతం షాకింగ్ గా మారింది.

అయితే.. చనిపోవటానికి ముందు ఆమేం చేసింది? ఎవరెవరితో మాట్లాడింది? ఏం మాట్లాడింది? ఆమెతో చివరగా చాట్ చేసినోళ్లు ఎవరు? అన్న అంశాల మీద ఫోకస్ చేశారు పోలీసులు.

ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయిన ప్రత్యూష.. దాదాపుగా వారం పాటు ఇంటర్నెట్ లో ఆత్మహత్య చేసుకునే పద్దతుల గురించి సెర్చ్ చేసినట్లుగా చెబుతున్నారు. నొప్పి తెలీకుండా ప్రాణాలు విడిచేందుకు వీలుగా ఈ విధానాన్ని ఫాలో అయినట్లుగా భావిస్తున్నారు.

ఆత్మహత్య చేసుకోవటానికి ముందు రాసిన లేఖలో.. తన చావు గురించి ఆమె ప్రస్తావించటం తెలిసిందే. ఆ లేఖతో పాటు.. ఆమె సెల్ ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆమె వాట్సాప్ చాటింగ్ ద్వారా.. మరణించటానికి ముందు ఎవరితో చాట్ చేసిన విషయాల్ని పరిశీలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సూసైడ్ చేసుకోవటానికి ముందు ప్రత్యూష ఒక హీరోయిన్ తో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు.

దీంతో.. ఆమె ఏం మాట్లాడారు? లాంటి అంశాల్ని తెలుసుకోవాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. చనిపోవటానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు.. దాన్ని ఎవరికి పంపి ఉంటారన్న దానిపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆమె డెడ్ బాడీకి అపోలో ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రోజు ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.