Begin typing your search above and press return to search.
ఫ్యాట్ టు ఫిట్.. టాప్ 10 స్టార్స్ గ్రేట్ కంబ్యాక్
By: Tupaki Desk | 7 May 2021 2:30 AM GMTవినోద పరిశ్రమలో చాలా విస్తృతమైన సమస్య బాడీ షేమింగ్. టాలీవుడ్ బాలీవుడ్ కూడా దీనికి మినహాయింపు కాదు. పరిశ్రమ సన్నజాజి తీగలకే చిక్కుతుంది. బరువు ఉంటే మనుగడ కష్టం అన్న భావన ఉంది. చాలా మంది సాధారణ రూపం ఉన్న బాలీవుడ్ తారలను తెరపై పాత్రలకు సరిపోయే విధంగా బరువు తగ్గమని సూచించినవాళ్లున్నారు.
అదనపు కొలెస్టరాల్ ని వదిలించుకోవడానికి అదనపు కసరత్తులు చేసి ఆహారం లో నియమాలు పాటించిన టాప్ 10 తారల వివరాలు పరిశీలిస్తే..
సారా అలీ ఖాన్
ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో బాలీవుడ్ స్టార్ లెట్ సారా అలీ ఖాన్ తన బరువు తగ్గించుకునే క్రమంలో అంతకుముందు తన పాత వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో సారా ఖాన్ షేర్ చేసిన త్రోబాక్ ఫోటోలలో అధికబరువుతో కనిపించారు. ఒకానొక సమయంలో ఆమె బరువు 96 కిలోలు. హార్మోన్ల అసమతుల్యత.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో ఎలా కష్టపడిందో వెల్లడించారు సారా. ఆ తర్వాత దానిని అధిగమించి స్లిమ్ లుక్ లోకి మారిపోయారు. దానికోసం ఎంతో శ్రమించారు.
జరీన్ ఖాన్
ఈ బాలీవుడ్ నటి 100 కిలోల నుండి 57 కిలోలకు పడిపోయింది ఏకంగా. పట్టుదల కృషి ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించింది. సరైన వ్యాయామం తో సరైన ఆహారాన్ని అనుసరించింది. ఒక ఇంటర్వ్యూలో పైలేట్స్.. వెయిట్ ట్రైనింగ్ .. జాగింగ్ .. స్విమ్మింగ్ గురించి జరీన్ వెల్లడించింది. ప్రతి రెండు గంటలకు ఆమె తినే ఆహారం ఏమిటో చెప్పారు.
కరీనా కపూర్
చబ్బీ స్టార్లెట్ నుండి ఈ రోజు ఆమె ఫిట్నెస్- దివా గా మారేవరకూ జర్నీ అసాధారణం. కరీనా కపూర్ శరీర పరివర్తన తరచుగా అభిమానుల చర్చల్లో భాగం. తషాన్ (2008) చిత్రంలో జీరో సైజ్ తో సన్నజాజి తీగను తలపించింది. సైజ్-జీరో దేవతగా కుర్రకారు హృదయాల్లో నిలిచిపోయింది ఇప్పటికీ.
ఇటీవల తన గర్భధారణ వల్ల అధిక బరువును కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో చూపించింది. డైటీషియన్ రుజుతా దివాకర్ తో ఫేస్ బుక్ లైవ్ సెషన్ లో ఆమె ఇలా అన్నారు. నేను నా గర్భధారణను ఆస్వాధించాను. ప్రపంచం చూడటానికి ఇది అక్కడే ఉంది. నేను నా డబుల్ సైజ్ గడ్డం(చిన్)ను చూస్తూ ఉన్నాను. నేను ప్రతి కోణం నుండి ఫోటోల్లో కనిపిస్తాను.. అని అన్నారు. కానీ బెబో ఫిట్ గా మరియు అద్భుతంగా కనిపించడానికి తిరిగి కసరత్తులతో సాధ్యమైంది.
సోనాక్షి సిన్హా
ఆ అమాయకమైన చూపులు.. అందమైన స్మైల్.. అద్భుత నటనతో పరిశ్రమలో ఒక ముద్ర వేయడానికి ముందు సోనాక్షి సిన్హా వాస్తవానికి 90 కిలోల బరువు ఉందనేది మీకు తెలుసా? బాలీవుడ్ లోకి ప్రవేశించే ముందు ఈ నటి దాదాపు 30 కిలోలు తగ్గి 60 వద్ద సెటిలైంది.
ఆలియా భట్
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తన తొలి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ముందు 20 కిలోల బరువు కోల్పోవాలని నటి అలియా భట్ ను కోరారు. జోహార్ దానిని తర్వాత తప్పుగా భావించాడు. బాడీ షేమింగ్ విషయంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఒక ప్రముఖ ఆన్ లైన్ పోల్ లో అలియా భట్ ను 2019 లో సెక్సీయెస్ట్ ఏషియన్ ఫిమేల్ గా ఎంపికైంది. ఇప్పటికి ఆలియాలో ఎంతో మార్పు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది ఆలియా. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది.
పరిణీతి చోప్రా
బాలీవుడ్ నాయిక పరిణీతి చోప్రా తనకు అధిక బరువు ఉందని అంగీకరించడమే కాక తన అనర్హత గురించి రకరకాల అనుభూతుల గురించి బహిరంగంగా మాట్లాడుతుంది. ముందు ... నా జీవితమంతా నేను ఎలా కనిపిస్తున్నానో.. ఎలా ఉన్నానో.. ప్రజలు నన్ను ఎలా చూస్తారో నేను చాలా కష్టపడ్డాను. నన్ను నిరంతరం ఎగతాళి చేసేవారు. కాని నేను నవ్వుకున్నాను. ఈ రోజు చాలా మంది బరువు తగ్గడానికి కారణమేమిటి? అని నన్ను అడుగుతారు. నేను బాలీవుడ్ ఒత్తిడికి లోనయ్యానా? అంటే.. దేవునికి కృతజ్ఞతలు.. నేను నటి అయ్యాను .. ఆ ఒత్తిడిని కలిగి ఉన్నాను! నేను సాధించలేనిదాన్ని సాధించగలను. మరింత నమ్మకంగా .. ప్రశాంతంగా ఉన్నాను.. గర్వంగా భావిస్తున్నాను! అని అన్నారు.
సోనమ్ కపూర్
సంజయ్ లీలా భన్సాలీ తన సావరియా (2007) తో పరిచయం చేసినప్పుడు అతను ఒక షరతు మాత్రమే విధించాడు. సోనమ్ వెంటనే బరువు తగ్గాలి. బరువు తగ్గించే వైద్యుడు ఆమె తల్లి సునీత .. సంజయ్ సహాయంతో సోనమ్ 32 కిలోల బరువు కోల్పోయింది. అప్పటి నుండి ఆమె బరువును తగ్గించే ప్రక్రియలోనే ఉంది. ఇప్పుడు సన్నజాజి తీగను తలపిస్తోంది. పెళ్లయ్యాక నవయవ్వన టీనేజీ యువతినే తలపిస్తోంది.
భూమి పెడ్నేకర్
భూమి పెడ్నేకర్ తొలి చిత్రం దమ్ లగా కే హైషా (2015) కథాంశమే ఆసక్తికరం. అధిక బరువుతో కొత్తగా పెళ్లి చేసుకున్న వధువు గురించిన స్టోరి ఇది. ఈ చిత్రంలో ఆమె నిష్కపటమైన నటన 2016 లో ఉత్తమ మహిళా అరంగేట్ర నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. కానీ వేదికపైకి వెళ్లే సమయానికే సన్నగా- బిగువుగా ఉన్న శరీరాన్ని అందరూ గమనించారు. భూమి 32 కిలోల బరువు కోల్పోయింది అంత తక్కువ సమయంలో. ఆమె ఆరునెలల్లో 89 కిలోల నుండి 57 కిలోలకు తగ్గింది.
అర్జున్ కపూర్
140 కిలోల బరువు నుండి 70 కేజీలకు తగ్గాడు. ఇషాక్ జాదే(2012) చిత్రంతో అరంగేట్రం చేసిన సంవత్సరాల తరువాత కూడా ఇంకా బరువుపై పోరాటం సాగించాడు. కరణ్ జోహార్ టాక్ షో లో అర్జున్ ను కరణ్ లాగానే కీటో డైట్ (తక్కువ కార్బ్- అధిక కొవ్వు ఆహారం) లో ఉన్న వ్యక్తిగా పరిచయం చేశాడు. ఒకానొక సమయంలో అర్జున్ ఒకేసారి ఆరు బర్గర్లు తినవచ్చని చెప్పాడు. కానీ ఇప్పుడు అన్నీ మానేసి స్లిమ్ అవుతున్నాడు.
రామ్ కపూర్
2019 లో ది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ స్టార్ రామ్ కపూర్ ఒక పెద్ద శారీరక పరివర్తన చెందుతున్నప్పుడు తన ఫోటోను ముందు.. ఆ తరువాత పంచుకున్నారు. 47 ఏళ్ల ఈ నటుడు తన కొవ్వును ఆహారం తగ్గించడం ద్వారా.. వ్యాయామాలతో అద్భుత జర్నీ అని పేర్కొన్నాడు.
అద్నాన్ సామి
11 నెలల్లో 155 కిలోల బరువు కోల్పోయినప్పుడు `లిఫ్ట్ కరా దే ఫేమ్` బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సామి అభిమానులను ఆశ్చర్యపరిచారు. 230 కిలోల నుండి అతను 75 కిలోలకు తగ్గిపోయి షాక్ కి గురి చేశాడు. ఇప్పుడు అతడు ఒక హీరోలా ఉన్నాడు.
ఇది నిజంగా గ్రేట్ జర్నీ:
టాలీవుడ్ లో స్వీటీ అనుష్క శెట్టి అనూహ్యంగా బరువు పెరిగి 10-15 కిలోలు తగ్గారు ఇటీవల. కీర్తి సురేష్ 5-6 కేజీలు తగ్గించుకున్నారు. ఇలియానా కూడా సన్నజాజిలా మారేందుకు ఇటీవల 12కేజీలు తగ్గారట. ఇలా కథానాయికలంతా అంతో ఇంతో వెయిట్ తగ్గారు. అయితే వీరంతా నార్మల్ వెయిట్ నుంచి పెరిగి తగ్గినవారే కానీ హెవీ వెయిట్ లేదు.
జరీన్ ఖాన్ - బరువు 100 కిలోల నుండి 57 కిలోలకు తగ్గారు ...
భూమి పెడ్నేకర్ - ఆమె సహజ మార్గంలో 27 కిలోలు కోల్పోయారు ...
సోనాక్షి సిన్హా - దబాంగ్ నటి 30 కిలోలు తగ్గారు! ...
సోనమ్ కపూర్ - 86 కిలోల నుండి 56 కిలోల వరకు బరువు తగ్గారు...
పరిణీతి చోప్రా - ఆమె బరువు 28 కిలోలు కోల్పోయారు ...
అలియా భట్ - అందమైన ఈ భామ 3 నెలల్లో 16 కిలోలు తగ్గారు.