Begin typing your search above and press return to search.
తండ్రీ కొడుకులిద్దరూ 'బంగార్రాజు'లేనా..?
By: Tupaki Desk | 27 Aug 2021 2:30 AM GMTతండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున - నాగచైతన్య ఇద్దరూ ''బంగార్రాజు'' సినిమాలో కలిసి నటించబోతున్నారు. ఇంతకముందు 'మనం' వంటి క్లాసిక్ సినిమాలో జత కట్టిన నాగ్ - చైతూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు.
2016 లో నాగార్జున - డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి సీక్వెల్ గా ''బంగార్రాజు'' తెరకెక్కనుంది. ఇటీవలే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే ఇందులో నాగచైతన్య పాత్ర ఎంటనేది ఆసక్తికరంగా మారింది.
'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో నాగ్ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టడంతో బంగార్రాజు పై క్లారిటీ వచ్చేసింది. టైటిల్ పోస్టర్ లో రెండు బైక్స్ ని పెట్టి నాగార్జున - చైతన్య ల పేర్లతో 'ఇన్ అండ్ యాజ్ బంగార్రాజు' అని పేర్కొన్నారు. దీంతో తండ్రీ కొడుకులిద్దరూ బంగార్రాజు పాత్రలోనే కనిపించనున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.
యంగ్ బంగార్రాజు గా నాగచైతన్య.. మిడిల్ ఏజ్ బంగార్రాజు గా నాగార్జున కనిపిస్తారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే నాగ్ - చైతూ సినిమాలో కలిసి కనిపించే ఛాన్స్ ఉండదు. అదే సమయంలో తండ్రీకొడుకులు ఇద్దరూ తాత-మనవళ్లుగా కనిపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
బంగార్రాజు పేరునే మనవడికి పెడతారని.. ఈసారి మనవడి సమస్యని పరిష్కరించడానికి స్వర్గం నుంచి వస్తారని.. ఇద్దరు బంగార్రాజులు కలిసి చేసే హంగామా ప్రేక్షకులను అలరించబోతోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నాగార్జున పాత్ర తరహాలోనే నాగచైతన్య క్యారక్టర్ కూడా కొంటెగా ఉంటుందని టాక్ నడుస్తోంది. మొత్తం మీద ఈ చిత్రాన్ని రొమాన్స్, ఎమోషన్స్ కలబోసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందించనున్నారు.
'బంగార్రాజు' చిత్రానికి సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించగా.. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతన్య కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోమ్ బ్యానర్ లో తండ్రీకొడుకుల ద్వయం కలిసి చేస్తున్న 'బంగార్రాజు' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.