Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ కోసం స్నేహితులుగా మారిన తండ్రీకొడుకులు

By:  Tupaki Desk   |   17 March 2020 11:00 AM GMT
ఆర్ ఆర్ ఆర్ కోసం స్నేహితులుగా మారిన తండ్రీకొడుకులు
X
కరోనా సృష్టించిన భయాందోళనల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసివేసి, చిత్ర నిర్మాణాలను కొన్ని రోజులు నిలుపుదల చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమ తెలియజేసింది. నిర్మాత‌ల మండ‌లి సూచ‌న మేర‌కు కొంత మంది నిర్మాత‌లు షూటింగ్స్‌ను, సినిమా రిలీజ్‌ల‌ను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసుకున్నారు.

అయితే అభిమానులు ఆర్ఆర్ఆర్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ సమయంలో రాజమౌళి తన కుమారుడు కార్తికేయతో కలిసి ఆర్ఆర్ఆర్ సెట్స్ లో సందడి చేసిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. షూటింగ్ సమయంలో తండ్రీకొడుకులు ఆర్‌ఆర్‌ఆర్ కోసం తమ పనుల్లో నిమగ్నమై ఉండగా తీసిన ఫోటోగా అర్థమవుతోంది. ఈ ఫోటోపై అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ తండ్రీకొడుకుల కంటే స్నేహితులుగా కనిపించడం లేదా అంటూ కామెంట్లు చేసారు. ఇదిలా ఉండగా ఎన్‌టిఆర్ మరియు రామ్ చరణ్ లు మాత్రం కరోనా వైరస్ గురించి కొన్ని చిట్కాలు చెప్తూ, భయాందోళనలకు గురి కావద్దని తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేసారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మహమ్మారి కరోనా గురించి అవగాహన కల్పించడానికి గత కొన్ని రోజులుగా సినీతారలు తమవంతు బాధ్యతగా అవేర్నెస్ వీడియోస్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.