Begin typing your search above and press return to search.
తండ్రి-తనయులతో క్రేజీ భామల రొమాన్స్ ఇది!
By: Tupaki Desk | 7 May 2022 7:47 AM GMTవెండి తెరపై తండ్రి-తనయులతో కలిసి నటించే ఛాన్స్ అందరికీ దక్కదు. ఆ ఛాన్స్ కొంత మందికే వస్తుంది. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లకే ఆఛాన్స్ ఉంటుంది. లేకుంటే అక్కడ లక్ ప్యాక్టర్ అయినా కలిసి రావాలి. ఆ రకంగా ఫాదర్-సన్ తో కలిసి నటించిన కొంత మంది భామల గురించి డిస్కస్ చేస్తే..ఈ సోయగాల గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. కాజల్ అగర్వాల్..తమన్నా.. రకుల్ ప్రీత్ సింగ్..లావణ్య త్రిపాఠీ లాంటి నాటి నాయికల నుంచి మేటి భామల వరకూ ఓ లుక్ ఏద్దాం.
అందాల రకుల్ ప్రీత్ సింగ్ కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగార్జున సరసన ‘మన్మథుడు 2’లో లకింగ్ తో జత కట్టింది. కానీ ఆరెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఇక క్రేజీ బ్యూటీ లావణ్య త్రిపాఠి నాగ చైతన్యతో ‘యుద్ధం శరణం’లో నటించింది.
కానీ ఈ సినిమా పెద్ద సక్సెస్ కాలేదు. అటుపై నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’ లో నటించింది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు తెచ్చిపెట్టింది. అలాగే చందమామ కాజల్ అగర్వాల్ కూడా తండ్రి-తనయులతో ఆడిపాడింది. `ఖైదీ నెంబర్ 150`లో మెగాస్టార్ కి జోడీగా నటించింది. అంతకు ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘మగధీర’.. ‘నాయక్’ సినిమాల్లో నటించింది.
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అబ్బాయి రామ్ చరణ్ చిరంజీవి తో రొమాన్స్ చేసింది. చరణ్ ఓ కలిసి `రచ్చ` చేసింది. చిరుతో ’సైరా నరసింహారెడ్డి’ లో నటించింది. రిలీజ్ కి ముందు చిరు సరసన తమన్నా ఏంటని విమర్శలొచ్చినప్పటికీ ఆన్ స్ర్కీన్ పై పెయిర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీంతో చిరంజీవి తాజా చిత్రం `భోళా శంకర్` లో మరోసారి తమన్నాని తీసుకున్నారు.
సీనియర్ ఎన్టీఆర్- బాలకృష్ణ సరసన బాలీవుడ్ హీరోయిన్ రతి అగ్నిహోత్రి నటించారు. ఎన్టీఆర్‌తో `కలియుగ రాముడు`..` ‘ప్రేమ సింహాసనం’ లాంటి సినిమాలు చేసారు. అటుపై బాలకృష్ణ తో `శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర` లో నటించారు. సహజనటి జయసుధ..రాధ.. రామారావు-బాలయ్యతో సినిమాలు చేసారు. ఏఎన్నార్-నాగార్జునతోనూ రాధ పలు సినిమాల్లో నటించారు.
`ఆదర్శవంతుడు`.. `వసంత గీతం`.. `గోపాల కృష్ణుడు` సినిమాల్లో ఏఎన్నార్ తో నటిస్తే..`విక్కీదాదా`లో కింగ్ తో నటించారు. శ్రీదేవి కూడా నాగేశ్వరరావుతో `ప్రేమాభిషేకం`.. `శ్రీరంగనీతులు’.. ‘ముద్దుల కొడుకు` లాంటి సినిమాల్లో నటించగా.. నాగార్జునతో `ఆఖరి పోరాటం’.. ‘గోవిందా గోవిందా’.. ‘ఖుదాగవా’.. `మిస్టర్ బేచారా`లో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది.
సూపర్ స్టార్ కృష్ణ- రమేష్ బాబు సరసన భానుప్రియ కొన్ని సినిమాల్లో నటించారు. కృష్ణ తో ‘గూడచారి 117’ లోరమేశ్ బాబు తో ‘బ్లాక్ టైగర్’ సినిమాలో నటించారు. గౌతమి కృష్ణ సరసన `అన్నా తమ్ముడు` .. `డియర్ బ్రదర్` లాంటి సినిమాల్లో నటించగా.. రమేశ్ బాబు తో ‘కృష్ణగారబ్బాయి’.. ‘బజారు రౌడీ’ సినిమాల్లో నటించింది. ఇంకా ఆమని..వాణీ విశ్వనాధ్..రుచితా ప్రసాద్ లాంటి వారు కృష్ణ-రమేష్ బాబులతో కలిసి పనిచేసారు.