Begin typing your search above and press return to search.
తన కవలల గురించి ఎమోషనల్ గా..
By: Tupaki Desk | 6 March 2017 4:18 AM GMTబాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ఫిలిం మేకర్ గా ఎన్నెన్నో సెన్సేషన్స్ సృష్టించాడు. మరోవైపు రియల్ లైఫ్ లో కూడా కొన్ని వివాదాలతో కాపురం చేసేశాడు. చెప్పుకోలేని ఎన్నో విషయాలను చిరునవ్వుతో చెప్పేసిన ఈ దర్శకుడు.. సొంత పిల్లల సంగతికి వచ్చేసరికి ఎమోషన్ అయిపోతున్నాడు.
కరణ్ జోహార్ నెల్లాళ్ల క్రితం తన ఇద్దరు కవలలను జననాల రిజిస్ట్రేషన్ చేయించిన సంగతి రీసెంట్ గా బయటకు వచ్చింది. ఆ సంగతులు చెబుతూ 'నా జీవితంలోకి నా ఇద్దరు పిల్లలు రూహి.. యష్ లను ఆహ్వానించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సైన్స్ అభివృద్ధి ఆసరాగా ఈ ప్రపంచంలోకి వాళ్లను ఆహ్వానించగలిగాను. ఒక పేరెంట్ గా ఎన్నెన్నో బాధ్యతలు ఉంటాయని తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలానే ఎమోషన్స్ ఉన్నాయి. ఇందుకోసం నన్ను నేను మెంటల్ గా.. ఫిజికల్ గా.. ఎమోషనల్ గా ఎంతో సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు నా పని.. ప్రయాణాలు.. సామాజిక బాధ్యతలు అన్నీ వెనక్కి వెళ్లిపోతాయని నాకు తెలుసు. నేను రెడీ అయ్యాను . వీరిని పెంచడంలో నన్ను ఎంతగానో ప్రేమించే మా అమ్మ నాకు తోడుగా నిలుస్తుంది. అఫ్ కోర్స్.. కుంటుంబంలాంటి స్నేహితులు కూడా' అన్నాడు కరణ్ జోహార్.
'సరోగసీ ద్వారా నా కలను నెరవరేర్చుకున్నాను. ఇందుకు నాకు సహకరించిన ఆ మహిళకు జీవితాంతం రుణపడి ఉంటాను.. నేను ఆమె కోసం ఎప్పుడూ ప్రార్ధిస్తాను' అని ఓపెన్ లెటర్ ద్వారా చెప్పాడు కరణ్ జోహార్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/