Begin typing your search above and press return to search.
తండ్రిని కోల్పోయిన ‘ఐరన్ మ్యాన్’.. సోషల్ మీడియాలో భావోద్వేగం
By: Tupaki Desk | 8 July 2021 9:30 AM GMTఐరన్ మ్యాన్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్.. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన తండ్రి, హాలీవుడ్ సీనియర్ నిర్మాత రాబర్ట్ డౌనీ సీనియర్ ప్రాణాలు కోల్పోయారు. 85 సంవత్సరాల వయసున్న సీనియర్ రాబర్ట్ డౌనీ.. నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జూనియర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్టు చేశారు.
ఇన్ స్టా గ్రామ్ లో తండ్రి పాత తరం ఫొటోను షేర్ చేసిన జూనియర్.. ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘గత రాత్రి నిద్రలోనే తండ్రి శాంతియుతంగా గడిచిపోయాడు. ఆయన నిజమైన మావెరిక్ ఫిల్మ్ మేకర్’’. అని పోస్టు చేశారు రాబర్ట్ డౌనీ జూనియర్.
1936లో జన్మించిన డౌనీ సీనియర్.. అద్బుతమైన ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాల్లో ముందున్న.. అదే జోనర్ లో పలు చిత్రాలను రూపొందించారు. దాదాపు 5 దశాబ్దాలకుపైగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ కాలంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రాబర్ట్ డౌనీ సీనియర్ దర్శకత్వం వహించిన చిత్రాల జాబితాలో.. బూగీ నైట్స్, మాగ్నలియా, టు లైవ్ అండ్ డై ఇన్ ఎల్.ఎ. ఉన్నాయి. ఇక, ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.