Begin typing your search above and press return to search.

హీరో ఆరోగ్య పరిస్థితి విషమం.. ఫ్యాన్స్‌ కోసం హీరో భార్య ప్రకటన

By:  Tupaki Desk   |   23 Jan 2023 12:43 PM GMT
హీరో ఆరోగ్య పరిస్థితి విషమం.. ఫ్యాన్స్‌ కోసం హీరో భార్య ప్రకటన
X
తమిళ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు దక్కించుకుని ఆ తర్వాత హీరోగా మారి దర్శకుడిగా నిర్మాతగా సినిమాలను చేస్తున్న విజయ్ ఆంటోనీ కొన్ని వారాల క్రితం బిచ్చగాడు 2 సినిమా షూటింగ్‌ లో భాగంగా మలేషియాలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా గాయ పడ్డ విషయం తెల్సిందే.

గత కొన్ని రోజులుగా చెన్నై లోని ప్రముఖ హాస్పిటల్ లో విజయ్ ఆంటోనీ చికిత్స పొందుతున్నాడు. విజయ్ ఆంటోనీ యొక్క ఆరోగ్యం ఈ మధ్య కాలంలో విషమించిందని.. వెంటనే ఆయన్ను ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు అంటూ తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మీడియాలో విజయ్ ఆంటోనీ యొక్క ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలతో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. విజయ్ ఆంటోనీ యొక్క ఆరోగ్య పరిస్థితి పై మీడియాలో వస్తున్న వార్తలపై ఫాతిమా ఆంటోనీ క్లారిటీ ఇచ్చింది.

విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా ఆంటోనీ స్పందించింది. తన భర్త ఆరోగ్యం గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అంటూ పుకార్లను కొట్టి పారేసింది.

తుంటికి గాయం అవ్వడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు తప్ప ఆయన ఆరోగ్యం విషమంగా లేదు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆమె ప్రకటనతో విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.