Begin typing your search above and press return to search.
పెళ్లిపై ఆసక్తి లేదంటున్న క్యూట్ బ్యూటీ
By: Tupaki Desk | 30 Oct 2020 6:05 PM GMTఅమీర్ ఖాన్ 'దంగల్' సినిమాలో నటించిన ఫాతిమా సనా షేక్ ప్రస్తుం బాలీవుడ్ లో వాంటెడ్ హీరోయిన్. యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఆమెతో నటించేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ దంగల్ బ్యూటీ పెళ్లి విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు మనుషులు ప్రేమలో ఉన్నారు అని చెప్పేందుకు పెళ్లి అనేది కేవలం ఒక దృవపత్రం వంటిది. అలాంటి దృవ పత్రం తాను కోరుకోవడం లేదు అంది. స్త్రీ పురుషులు జీవితాంతం కలిసి జీవించాలని కోరుకోవాలి. అంతే తప్ప పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారు అనుకోవడం అవివేకం.
పెళ్లి అనే కాన్సెప్ట్ పై తనకు నమ్మకం లేదు. నేను జీవితంలో పెళ్లి చేసుకోవాలని భావించడం లేదు అంటోంది. ఈ క్యూట్ బ్యూటీ ఇదే మాటపై ఉంటుందా లేదంటే ముందు ముందు పరిస్థితుల ప్రభావం.. భాగస్వామి ఒప్పందం మేరకు పెళ్లి చేసుకుంటుందా చూడాలి. ఈ 28 ఏళ్ల బ్యూటీ ప్రస్తుతం హిందీలో మూడు సినిమాల్లో నటిస్తుంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. చిన్నప్పటి నుండి కూడా నటిగా కనిపిస్తున్న ఫాతిమా హీరోయిన్ గా కూడా స్టార్ డంను దక్కించుకుని వరుసగా సినిమాలు చేయడం జరుగుతుంది. బాల నటిగా చేసిన వారు హీరోయిన్ గా సెటిల్ అవ్వడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఫాతిమా ఆ అరుదైన ఘనత దక్కించుకుంది.