Begin typing your search above and press return to search.
అమీర్ తో ఎఫైర్.. ఈమె ఏమందంటే?
By: Tupaki Desk | 26 Dec 2018 10:38 AM GMTతొలి సినిమాతోనే ప్రేక్షకులను తన నటనతో బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ ఆకట్టుకుంది. ‘దంగల్’ సినిమాలో అమీర్ ఖాన్ కూతురి పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత అమీర్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలోనూ ఆమెకు అవకాశం దక్కింది. దీంతో ఆమెకు అమీర్ కు ఎఫైర్ ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యారు. దీని పై ఇప్పటిదాకా అటు అమీర్ కానీ ఇటు సనా కానీ స్పందించలేదు.
అయితే తొలిసారి సనా షేక్ ఈ రూమర్లపై స్పందించింది. మీడియాలో తనకు అమీర్ కు ఎఫైర్ ఉందంటూ వచ్చిన వార్తను చూసి తాను మొదట్లో చాలా డిస్టర్బ్ అయ్యానని చెప్పింది. ఇక ఈ వార్తలు చూసి తన తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేశారని చెప్పింది.
ఐతే తాను ఈ వార్తలను ఇక పట్టించుకోదలుచుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు గురించి ఆలోచించడం మానేశానని తెలిపింది. అయితే తాను రెండో సినిమా అమీర్ పక్కన హీరోయిన్ గా నటించలేదు. ఒక కీలక పాత్రలో మాత్రమే నటించానని తెలిపింది. దీని పై కూడా తనకు అమీర్ కు అఫైర్ ఉందని రాయడం ఎంత వరకు సమంసమో ఆలోచించుకోవాలని అన్నారు. ఇక పై తన గురించి ఏం మాట్లాడుకున్న పట్టింపు లేదని అసహనం వ్యక్తం చేసింది.
అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ డిజాస్టర్ గా మిగలడం మాత్రం ఫాతిమాకే పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత తాను ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లు అనేక ఉంటాయని అలాంటి వాటిని పట్టించుకోకుండా ఆమె తన సినిమాల పై దృష్టిసారించాలని ఆమె సన్నిహితులు ధైర్యం చెబుతున్నారట..