Begin typing your search above and press return to search.

చీర‌-ర‌వికె తాళిబొట్టుతో ఫాతిమా కిర్రాక్

By:  Tupaki Desk   |   2 May 2022 1:30 AM GMT
చీర‌-ర‌వికె తాళిబొట్టుతో ఫాతిమా కిర్రాక్
X
ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఫాతిమా స‌నా షేక్ ఇటీవ‌ల నిరంత‌రం వార్తా క‌థ‌నాల్లోకి వ‌స్తోంది. ఇంత‌కుముందు అమీర్ ఖాన్ విడాకుల నేప‌థ్యంలో దానికి కార‌ణం తెర‌వెన‌క ఉన్న ఈ బ్యూటీనే.. అమీర్ పెళ్లాడేది ఈమెనే అంటూ నెటిజ‌నుల్లో గుస‌గుస‌లు వైర‌ల్ అయ్యాయి. దంగ‌ల్ త‌ర్వాత‌ ప్ర‌స్తుతం అమీర్ స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఈ బ్యూటీపై ఇలాంటి రూమ‌ర్లు ఊహించ‌నివి.

ఫాతిమా సనా షేక్ `మోడరన్ లవ్` సిరీస్  లోను చాలా కూల్ గా ఫంకీ అమ్మాయిగా నటించి మెప్పించింది. ఆంథాలజీ చిత్రం `థార్` ట్రైలర్  విడుదల తర్వాత తనకు లభిస్తున్న ప్రతిస్పందనల విష‌యంలో స‌నా షేక్ సంతోషంగా ఉంది. మోడరన్ లవ్ - థార్ రెండింటి ట్రైలర్ విడుదలైన తర్వాత నాకు వస్తున్న రెస్పాన్స్ తీపి జ్ఞాప‌కంలా ప్రోత్సాహకరంగా ఉంది అని మురిసిపోతోంది.

మోడరన్ లవ్ లో పాత్ర నేను మొదటిసారి ప్రయత్నించాను. ఈ సిరీస్ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. రెండిటి సెట్స్ లో చాలా సరదాగా షూటింగ్ చేసాను. ఇప్పుడు ప్రేక్షకుల నుండి స్పందన చూడటానికి వేచి ఉండలేను.. అని తెలిపింది. మోడరన్ లవ్  కాకుండా థార్ -సామ్ బహదూర్ చిత్రాల్లో ఫాతిమా సనా షేక్ కనిపించనుంది. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఫాతిమా లేటెస్ట్ ఫోటోషూట్ అంతే వైర‌ల్ గా మారింది. ఫాతిమా త‌న పాత్ర లుక్ కి సంబంధించిన ఫోటో గ్లింప్స్ ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది హీటెక్కిస్తోంది. చీర - ర‌విక .. మెడ‌లో తాళి బొట్టుతో ఫాతిమా మ‌రో లెవ‌ల్లో క‌నిపిస్తోంది.