Begin typing your search above and press return to search.
రెడ్ హాట్ శారీలో రంభలా ఉంది!
By: Tupaki Desk | 16 Feb 2020 4:30 AM GMTఒకసారి ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు అలవాటు పడ్డాక నటనను వదిలేయడం అంత సులువేమీ కాదు. కెరీర్ ముందుకు సాగినా సాగకపోయినా ఇక్కడ ఆటాడాలి. గ్లామర్ ప్రపంచంలో ఇదో పెద్ద చిక్కు అనే చెప్పాలి. అమీర్ ఖాన్ లాంటి అగ్ర కథానాయకుడు దంగల్ (2016) లాంటి సంచలన చిత్రంతో తెరకు పరిచయం చేసినా.. ఎందుకనో ఫాతిమా కెరీర్ ఆశించినంత ఎత్తుకు ఎదగలేదు. ముంబై ర్యాంప్ నుంచి బరిలో దిగే అందాల భామల సోకుల ముందు తాను నిలబడ లేకపోయింది. అయినా నటనలో అంతో ఇంతో పరిణతి చూపిస్తోంది కాబట్టి అమీర్ వరుస అవకాశాలిచ్చాడు కాబట్టి ఇప్పటికీ నటిస్తోంది.
ఇంతకుముందు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లోనూ ఫాతిమా అవకాశం అందుకుంది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడం తనకు పెద్ద మైనస్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ `సూరజ్ పే మంగళ్ బరి` అనే చిత్రంలో నటిస్తోంది. సుప్రియా పిల్‌గావ్ కర్ ఇందులో సహనటుడు. తాజాగా కోస్టార్ మనోజ్ బాజ్‌పేయి ఇన్ స్టాగ్రామ్ లో ఫాతిమా ఫోటోని షేర్ చేశారు.
ఈ ఫోటోలో మరాఠా ఆడపడుచుని తలపిస్తోంది ఫాతిమా. ఆ రెడ్ హాట్ శారీ ఫాతిమా అందాన్ని పదింతలు పెంచిందనే చెప్పాలి. తాజా లుక్ ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాత్ర కోసం అతను ఫాతిమాను ఎందుకు ఎంచుకున్నారు? అని ప్రశ్నిస్తే... తనలోని అంకితభావమే ఎంపికకు కారణం అని తెలిపాడు. పైగా మరాఠా యువతిగా తన పాత్రలో డ్యూయల్ షేడ్ ఉంటుంది. పైకి మంచిగా కనిపిస్తూనే లోన విలనీ చూపించే పాత్ర అది. ఫాతిమా ఇన్వాల్వ్ అయ్యి నటిస్తుంది. భావోద్వేగాల్ని అద్భుతంగా పలికించగలదు.. అందుకే ఎంపిక చేసుకున్నానని అభిషేక్ చెబుతున్నారు. 1990 ముంబై బ్యాక్ డ్రాప్ స్టోరి ఇది. కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ గా ఉంటాయి. ఇందులో దిల్జిత్ దోసంజ్ ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ నిర్మిస్తోంది. 2020 ద్వితీయార్థంలో సినిమాని రిలీజ్ చేయనున్నారు.